ఐపీఎల్ లో నేను గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడినప్పుడు నన్ను ఫినిషర్ గా వాడేవాళ్లు. నాకు మిగిలేవే 3-4 ఓవర్లు. అప్పుడు నాకు పెద్దగా ఆడే ఆస్కారం కూడా దక్కలేదు. టెస్టు మ్యాచ్ ల మాదిరిగా టీ20లలో భారీ స్కోర్లు చేయడం అంత ఈజీ కాదు. కానీ నేను మాత్రం మూడు ఫార్మాట్ల మీద దృష్టిసారిస్తున్నా. రంజీలలోనే గాక సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే లలో కూడా పరుగులు సాధిస్తున్నా..’అని చెప్పాడు.