వన్డేలకు పనికిరాని సూర్యకుమార్ యాదవ్... ఆ నలుగురు వస్తే టీమిండియాకి ప్లస్ ఆ! మైనస్ ఆ...

First Published Jan 25, 2023, 1:17 PM IST

2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, అదే ఏడాది టీ20 వరల్డ్ కప్ కూడా ఆడేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడతాడా? అతని ఫామ్ చూస్తుంటే సూర్య వన్డేల్లో కొనసాగడం అనుమానంగానే మారింది...
 

Virat Kohli-Suryakumar Yadav

టీ20ల్లో 43 ఇన్నింగ్స్‌ల్లో 180.34 స్ట్రైయిక్ రేటుతో 1578 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం పేలవ ఫామ్‌ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇప్పటిదాకా 20 వన్డేలు ఆడిన సూర్య 18 ఇన్నింగ్స్‌ల్లో 28.86 సగటుతో 433 పరుగులే చేశాడు...

Shreyas Iyer and Suryakumar Yadav

టీ20ల్లో ఇప్పటికే 13 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు సాధించి రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం ఇప్పటిదాకా 2 హాఫ్ సెంచరీలే చేశాడు. టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే సూర్య, వన్డేల్లో ఐదో, ఆరో స్థానాల్లో బ్యాటింగ్‌కి రావడం అతన్ని ఇబ్బందిపెడుతోంది...

suryakumar

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడంతో సూర్యకి వరుస అవకాశాలు దక్కాయి. అతను రీఎంట్రీ ఇస్తే సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఒకరు రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది...

కెఎల్ రాహుల్ కూడా వన్డేల్లో వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. రాహుల్ రీఎంట్రీ ఇస్తే ఇషాన్ కిషన్ మళ్లీ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కారణంగా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది...
 

Image credit: PTI

కెఎల్ రాహుల్‌, శ్రేయాస్ అయ్యర్‌లకు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. వీరితో పాటు రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా కూడా ట్రాక్‌లోకి వస్తున్నారు. రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇస్తే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్... వీరిలో ఒకరికే తుదిజట్టులో చోటు ఉంటుంది...
 

జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే.. ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కి పరిమితం అవుతున్నా శార్దూల్, ఉమ్రాన్ మాలిక్... వరల్డ్ కప్‌లో తుది జట్టులోకి రావడం కష్టమైపోతుంది..
 

Image credit: PTI

గాయాలతో, ఫిట్‌నెస్ సమస్యలతో, వ్యక్తిగత కారణాలతో జట్టుకి దూరమైన కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తే ఓ విధంగా ప్లస్సే అయినా మరోవిధంగా చూస్తే మైనస్సే. ఎందుకంటే బాగా ఆడుతున్న టీమ్‌లో మార్పులు చేస్తే, అది జట్టు సమతుల్యాన్ని దెబ్బ తీస్తుంది...
 

Image credit: PTI

మొత్తానికి ద్వైపాక్షిక సిరీసుల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న భారత జట్టు, ఇదే ఫామ్‌ని, ఇదే ఆటతీరుని వరల్డ్ కప్‌లో చూపించగలుగుతుందా? అనేది చాలా పెద్ద అనుమానం...

Image credit: Getty

టీమ్ కాంబినేషన్, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో రకరకాల మార్పులు చేస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్... వరల్డ్ కప్ సమయానికి ఇదే రిథమ్‌ని కంటిన్యూ అయ్యేలా చర్యలు తీసుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వన్డే వరల్డ్ కప్ దాకా వేచి చూడాల్సిందే.. 

click me!