ఎమ్మెస్ ధోనీని క్లీన్‌బౌల్డ్ చేశా, ఈసారి నా టార్గెట్ విరాట్ కోహ్లీ... చేతన్ సకారియా కామెంట్...

Published : Mar 18, 2022, 06:41 PM IST

కష్టాల కొలిమిలో కాలితేనే, తళతళ మెరిసే స్వర్ణం తయారవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది చెప్పే మాట ఇదే. కానీ కొందరికి మాత్రం ఆనందం, దుఃఖం రెండూ కలిసి వస్తాయి. యంగ్ బౌలర్ చేతన్ సకారియా పరిస్తితి కూడా ఇదే...

PREV
112
ఎమ్మెస్ ధోనీని క్లీన్‌బౌల్డ్ చేశా, ఈసారి నా టార్గెట్ విరాట్ కోహ్లీ... చేతన్ సకారియా కామెంట్...

ఐపీఎల్ 2021 వేలంలో రూ.కోటీ 20 లక్షలు దక్కించుకుని, అందరి దృష్టిని ఆకర్షించాడు చేతన్ సకారియా. రాజస్థాన్ రాయల్స్‌ కొనుగోలు చేసిన ఈ యంగ్ పేసర్, ఆరంగ్రేటం మ్యాచుల్లోనే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

212

గత ఏడాది సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో చేతన్ సకారియా బిజీగా ఉన్న సమయంలో అతని తమ్ముడు రాహుల్ సకారియా ఆత్మహత్య చేసుకున్నాడు... 

312

ఆ తర్వాత కొన్నిరోజులకే సకారియా తండ్రి అనారోగ్యంతో మరణించాడు. టెంపో డ్రైవర్‌గా పనిచేస్తూ ఆ డబ్బులతో కొడుకులను పెంచి, పెద్ద చేసిన సకారియా తండ్రి... కొడుకు సక్సెస్‌ను పూర్తిగా చూడకుండానే కన్నుమూశాడు..

412

అయితే ఈ బాధలను కష్టాలనే గుండెల్లో నింపుకుని, మరింత కసిగా బంతులు విసిరడం మొదలెట్టాడు చేతన్ సకారియా. ఆ రిజల్ట్ తన కెరీర్ గ్రాఫ్‌లో కనిపించింది...

512

గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన చేతన్ సకారియా, 14 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా శ్రీలంక టూర్‌లో ఆరంగ్రేటం కూడా చేసేశాడు...
 

612

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడబోతున్నాడు చేతన్ సకారియా. సకారియాని వేలంలో రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

712

‘ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ వికెట్ తీయడం నా బెస్ట్ మూమెంట్. పంజాబ్ కింగ్స్‌తో నేను ఆడిన నా మొదటి ఐపీఎల్ మ్యాచ్ కూడా చాలా స్పెషలే కానీ ఎమ్మెస్ ధోనీ వికెట్ తీయడంతో సమానం కాదు...

812

ఎమ్మెస్ ధోనీ ఓ లెజెండ్. ఆయనకి బౌలింగ్‌ చేయడం, క్లీన్ బౌల్డ్ చేయడం చాలా అద్భుతమైన ఫీలింగ్. నెట్స్‌లో నేను ఏబీ డివిల్లియర్స్‌కి బౌలింగ్ చేసేవాడిని...

912

ఏబీడీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఆయన అన్ని రకాల షాట్స్ ఆడగలరు. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి ఏబీ డివిల్లియర్స్ వికెట్ తీయాలనే నా కల తీరదు...

1012

అందుకే నా నెక్ట్స్ టార్గెట్ విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ భాయ్ వికెట్ తీయడమే నా ముందున్న లక్ష్యం...’ అంటూ కామెంట్ చేశాడు చేతన్ సకారియా...

1112

ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో ఉండడంతో ఈ రెండు జట్ల మధ్య లీగ్ స్టేజ్‌లో ఒకే మ్యాచ్ జరగనుంది. 

1212

ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ఆర్‌సీబీ, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. చేతన్ సకారియా కల నెరవేరాలంటే ఈ మ్యాచ్‌లో విరాట్‌ను అవుట్ చేయాలి? లేదా రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరితేనే మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories