విరాట్ కోహ్లీకి బదులు అతన్ని సెలక్ట్ చేయాలనుకున్న ధోనీ... ఆ ఒక్క నిర్ణయంతో వెంగ్‌సర్కార్‌పై కక్ష..

First Published Jun 22, 2023, 7:25 PM IST

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ, 15 ఏళ్లుగా టీమిండియాలో కీ ప్లేయర్‌గా ఉన్నాడు. ప్రస్తుత తరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా, అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఎంపిక వేనక చాలా పెద్ద తతంగమే జరిగిందట..
 

2003 ప్రపంచ కప్ తర్వాత ఏరికోరి గ్రెగ్ ఛాపెల్‌ని హెడ్ కోచ్‌గా తెచ్చుకుంది టీమిండియా. అదే ఛాపెల్ ఎంట్రీ భారత జట్టులో సంచలన మార్పులు తీసుకొచ్చింది. 2007 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించడంతో ఛాపెల్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది..

అయితే గ్రెగ్ ఛాపెల్‌ని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని బీసీసీఐ భావించినప్పుడు, అతనికి మద్ధతుగా నిలిచిన ఒకే ఒక్కడు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. అయితే గ్రెగ్ ఛాపెల్‌కి సపోర్ట్‌గా నిలబడినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోని దిలీప్ వెంగ్‌సర్కార్, విరాట్ కోహ్లీని టీమిండియాకి ఎంపిక చేయడంతోనే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట...

Latest Videos


అండర్19 వన్డే వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ దేశవాళీ టోర్నీల్లో కూడా బాగా రాణించాడు. అతన్ని శ్రీలంక టూర్‌కి ఎంపిక చేయాలని భావించాడట దిలీప్ వెంగ్‌సర్కార్. ఇదే అతనికి పెద్ద మైనస్ అయ్యిందట..

‘దిలీప్ వెంగ్‌సర్కార్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని టీమ్‌కి సెలక్ట్ చేయాలని భావించాడు. అయితే ఎస్ బద్రీనాథ్‌ని టీమ్‌కి ఆడించాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు...

ఆస్ట్రేలియా వెళ్లి ఇండియా A గేమ్స్ చూసిన దిలీప్ వెంగ్‌సర్కార్, విరాట్ కోహ్లీకి అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. బద్రీనాథ్‌ని కాదని విరాట్ కోహ్లీని టీమ్‌కి ఎంపిక చేయడం, అప్పటి టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ, ఎన్ శ్రీనివాసన్‌లకి నచ్చలేదు..

MS Dhoni

ఎందుకంటే బద్రీనాథ్, ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్నాడు. అప్పటి బీసీసీఐ ట్రెజరర్ ఎన్ శ్రీనివాసన్, సీఎస్‌కేకి యజమాని కూడా. దీంతో బద్రీనాథ్‌ని కాదని విరాట్ కోహ్లీని సెలక్ట్ చేసినందుకు దిలీప్ వెంగ్‌సర్కార్‌ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పించారు...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి బయటపెట్టాడు..

click me!