ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ! కామెంటేటర్‌గా సురేష్ రైనా... ఐపీఎల్ 2022 సీజన్‌లో...

Published : Mar 24, 2022, 04:09 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 ఫ్రాంఛైజీల ఫార్మాట్‌లో లీగ్ సాగనుంది. కెప్టెన్లుగా హార్ధిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, ఫాఫ్ డుప్లిసిస్ ఐపీఎల్ కెరీర్ మొదలెట్టబోతున్నారు. వీటన్నింటికీ భిన్నంగా ఈసారి విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ... సాధారణ ప్లేయర్లుగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడబోతున్నారు...  

PREV
110
ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ! కామెంటేటర్‌గా సురేష్ రైనా... ఐపీఎల్ 2022 సీజన్‌లో...

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందే ఆర్‌సీబీ కెప్టెన్‌గా తనకి ఇదే ఆఖరి సీజన్ అంటూ ప్రకటించాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు...

210

9 సీజన్ల పాటు ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ... 12 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ... ఇద్దరూ ఈసారి సాధారణ ప్లేయర్లుగా ఐపీఎల్ ఆడబోతున్నారు...

310

ఐపీఎల్‌లో 13 సీజన్లలో ఆడి, లీగ్‌లో 5500లకు పైగా పరుగులు చేసిన ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా... ఈసారి కామెంటేటర్‌గా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు...

410

ఐపీఎల్‌ చరిత్రలో అతి తక్కువ మంది కెప్టెన్లను వాడిన ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2008 నుంచి చెన్నై సారథిగా కొనసాగుతూ వస్తున్నాడు ఎమ్మెస్ ధోనీ. ఐపీఎల్ ఆరంభం నుంచి 14 సీజన్ల పాటు కెప్టెన్‌గా కొనసాగిన ఏకైక ప్లేయర్ మాహీయే...

510

మాహీ అందుబాటులో లేని ఆరు మ్యాచుల్లో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, సీఎస్‌కే సారథిగా వ్యవహరించాడు. సీఎస్‌కేకి మూడో సారథిగా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు రవీంద్ర జడేజా...

610

‘ఎమ్మెస్ ధోనీ స్థానంలో రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో... చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపించగలరు... మాహీ సక్సెస్‌ను కొనసాగించగల సత్తా వీరిలో ఉంది...

710

కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే నా స్నేహితులు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా కామెంటేటర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు...

810

రవిభాయ్ కూడా ఈ సీజన్‌లో కామెంటేటర్‌గా ఉన్నాడు. నా ఫ్రెండ్స్ నుంచి టిప్స్ తీసుకోవాలని అనుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా... 

910

ఐపీఎల్‌లో 205 మ్యాచులు ఆడి 5611 పరుగులు చేసిన సురేష్ రైనా... విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ బ్యాటర్‌గా ఉన్నాడు... 

1010

గత సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, 17.77 సగటుతో 160 పరుగులు చేశాడు. ఎమ్మెస్ ధోనీ కంటే మెరుగ్గా పరుగులు చేసినప్పటికీ, రైనాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...

Read more Photos on
click me!

Recommended Stories