ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్. 11 సార్లు ఫ్లేఆఫ్స్, 9 సార్లు ఫైనల్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్... నాలుగు సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో అడుగుపెడుతున్న సీఎస్‌కే, టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లలో ఒకటిగా ఉంది...
ఐపీఎల్ 2020 సీజన్ పరాభవం తర్వాత 2021 సీజన్‌లో అన్యూహ్యంగా టైటిల్ గెలిచి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్...
28
టైటిల్ గెలిచిన జట్టులోని రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, దీపక్ చాహార్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, ఎన్ జగదీశన్ వంటి కోర్ ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేసింది మాహీ టీమ్...
38
‘రవీంద్ర జడేజా కొన్నేళ్లుగా చాలా మెచ్యూర్డ్ ప్లేయర్‌గా మారాడు. ఫార్మాట్‌కి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టు తన గేమ్‌ను మార్చుకుంటున్నాడు జడ్డూ...
48
ఐపీఎల్ 2021 సీజన్ గెలవడంలో జడేజా పాత్ర చాలా ఉంది. ఒకవేళ ఎమ్మెస్ ధోనీ, బ్రేక్ కావాలని కోరుకుంటే... ఆ పొజిషన్‌లో దూరిపోవడానికి జడేజా సిద్ధంగా ఉన్నాడు...
58
నా ఉద్దేశం ప్రకారం ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలోనే జడేజాకి కెప్టెన్సీ అప్పగించి, మాహీ ప్లేయర్‌గా ఆడొచ్చు.. ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
68
‘రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉండడం సీఎస్‌కేకి చాలా పెద్ద అడ్వాంటేజ్. అతని ఆటలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, స్టార్ ప్లేయర్‌గా, ఫ్యూచర్ స్టార్‌గా మారతాడు...
78
రుతురాజ్ అన్ని రకాల షాట్స్ ఆడగలడు. అన్నింటికీ మించి అతని షాట్ సెలక్షన్‌లో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. షాట్ సెలక్షన్‌కి ఆయన ఎప్పుడూ భయపడడు..’ అంటూ కామెంట్ చేశాడు గవాస్కర్...
88
ఐపీఎల్ 2022 సీజన్ ఓపెనర్‌లో మార్చి 26న కేకేఆర్‌తో మ్యాచ్ ఆడే సీఎస్‌కే, మార్చి 31న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతుంది. ఆ తర్వాత ఏప్పిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో, ఏప్పిల్ 9న సన్‌రైజర్స్‌తో మ్యాచులు ఆడుతుంది చెన్నై సూపర్ కింగ్స్...