ధోనీని టీమిండియా కోచ్‌గా నియమించండి! దాంట్లో అతను మాస్టర్ మైండ్... పాక్ మాజీ సల్మాన్ భట్ కామెంట్..

First Published Nov 18, 2022, 6:57 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచి ఇంటిదారి పట్టిన భారత జట్టు, 2022 టోర్నీలో సెమీస్ నుంచి నిష్కమించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో అప్పుడెప్పుడో 2013లో చివరిగా ఐసీసీ (ఛాంపియన్స్ ట్రోఫీ) టైటిల్ గెలిచిన భారత జట్టు, 9 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది... 

ఆగస్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్... ఆఖరి మ్యాచ్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ ఆడాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో రనౌట్ అయిన ధోనీ, ఆఖరి మ్యాచ్‌లోనూ రనౌట్‌ అయ్యి పెవిలియన్ చేరాడు...

Dhoni-Gambhir

రెండు రనౌట్ల మధ్య సాగిన క్రికెట్ కెరీర్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మహేంద్ర సింగ్... టెస్టుల్లో టీమ్‌ని నెం.1గా నిలిపాడు. వన్డే, టీ20 సిరీసుల్లో ఫినిషర్‌గానూ అద్భుత విజయాలు అందించాడు..

ms dhoni

2021 టీ20 వరల్డ్ కప్‌కి మెంటర్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2023 ఐపీఎల్ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ధోనీని టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించాలని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...
 

‘మహేంద్ర సింగ్ ధోనీలాంటి ప్లేయర్ దొరకడం టీమిండియా అదృష్టం. ప్రెషర్‌ని ఎలా తట్టుకుని నిలబడాలో మాహీకి బాగా తెలుసు. ధోనీ ప్లేయర్లను చక్కగా అర్థం చేసుకుంటాడు, అంతే త్వరగా గేమ్‌ని రీడ్ చేస్తాడు. అందుకే అంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కాగలిగాడు...

Image credit: MS DhoniFacebook

మాహీ గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కూడా. ప్రతీ చిన్న విషయంలో ధోనీ తీసుకునే నిర్ణయాలు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేవి. ఏ టీమ్‌కి అయినా ధోనీ లాంటి మాస్టర్ మైండ్ దొరకడం గొప్ప ఆస్తి కిందే లెక్క. మాహీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే టీమిండియాకి మరిన్ని విజయాలను అందించేవాడు...

ఇప్పటికైనా మాహీని టీమిండియాకి కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది. ఆటగాళ్ల నుంచి నూటికి 200 పర్సెంట్ పర్ఫామెన్స్ ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ప్లేయర్లలోని ఒత్తిడిని తగ్గించి, వారి నుంచి రావాల్సిన రిజల్ట్ రాబట్టగలడు...’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్.. 

click me!