ఈసారి కప్ నమ్‌దే! ఒక్కటి గెలిస్తే చాలు, ఆ తర్వాత మూడూ మావే... ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

First Published Nov 18, 2022, 6:26 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగియగానే ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఐపీఎల్ 2023 సీజన్‌కి సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్‌ వివరాలను ప్రకటించేశాయి అన్ని ఫ్రాంఛైజీలు. కెప్టెన్లను మారుస్తూ, కోచింగ్ స్టాఫ్‌ని మారుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఫ్రాంఛైజీలు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఏబీ డివిల్లియర్స్, ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు...

ఆర్‌సీబీ తరుపున 12 సీజన్లు ఆడిన ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన 2021 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 సీజన్‌లో పాల్గొనని ఏబీ డివిల్లియర్స్, బ్యాటింగ్ కన్సల్టెంట్ కోచ్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీకి సేవలు అందించబోతున్నాడు...

‘ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 15 సీజన్లు అయ్యాయి. కాబట్టి ఇప్పటిదాకా టైటిల్ గెలవని జట్లు, ఈసారి సంకెళ్లు తెంచుకోడానికి ఇష్టపడతాయి. ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నా. ఒక్కసారి టైటిల్ గెలిస్తే చాలు.. ఆ తర్వాత 2, 3, 4 వెంటవెంటనే గెలవగల సత్తా ఆర్‌‌సీబీకి ఉంది...

ఆర్‌సీబీతో నా అనుబంధం చాలా ప్రత్యేకం. ఓ రకంగా ఆర్‌సీబీ నా జీవితాన్ని చాలా మార్చేసింది. ఈ జట్టుతో ఉన్న జ్ఞాపకాలు చాలా ప్రత్యేకం. నా ఫ్రెండ్స్‌, బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టీమ్‌లో ఉన్నారు. ఇది నాకు కుటుంబంలాంటిదే.. అందుకే మళ్లీ ఈ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఏబీ డివిల్లియర్స్...
 

ఐపీఎల్ 2020,21 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆడింది. మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని ఓడించిన ఆర్‌సీబీ, రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది...

Image credit: PTI

ఐపీఎల్‌లో 184 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 5162 పరుగులు చేశాడు. మొదటి మూడు సీజన్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆడిన ఏబీ డివిల్లియర్స్, 2011 నుంచి 2021 వరకూ ఆర్‌సీబీ తరుపున ఆడాడు. ఐపీఎల్‌లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఏబీడీ... 

click me!