టీ20 వరల్డ్ కప్‌‌లో మూడో ప్లేస్ ఎవరిది? పాక్ చేతుల్లో ఓడిన కివీస్‌దా! ఇంగ్లాండ్‌తో ఓడిన టీమిండియాదా...

Published : Nov 18, 2022, 05:50 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది. రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓడితే, మొదటి సెమీస్‌లో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది న్యూజిలాండ్. మరి ఐసీసీ టోర్నీలో మూడో ప్లేస్ ఎవరిది? నాలుగో ప్లేస్ ఎవరిది?...

PREV
16
టీ20 వరల్డ్ కప్‌‌లో మూడో ప్లేస్ ఎవరిది? పాక్ చేతుల్లో ఓడిన కివీస్‌దా! ఇంగ్లాండ్‌తో ఓడిన టీమిండియాదా...
Rohit-Rahul

పాకిస్తాన్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 152 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఓడింది. పాక్, కివీస్ విధించిన లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింద. మరోవైపు రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా 168 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది ఇంగ్లాండ్...

26
Kane Williamson

ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరాయి. పాకిస్తాన్ ఫైనల్‌లో ఓడి రన్నరప్ టైటిల్‌తో సెటిల్ అయితే, ఇంగ్లాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. మరి మూడో ప్లేస్‌ ఎవరిది? నాలుగో ప్లేస్ ఎవరిది?...

36
Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఓడిన ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ సమయంలో ఇదే ప్రశ్న ఎదురైంది. హార్ధిక్ పాండ్యా, కేన్ విలియంసన్ ఈ ప్రశ్నకు తమ స్టైల్‌లో సమాధానాలు చెప్పారు...

46
Image credit: Getty

‘వరల్డ్ కప్ ముగిసింది. దాన్ని అక్కడే వదిలేశాం. సెమీ ఫైనల్‌లో ఓడిపోయినందుకు కాస్త నిరాశ మిగిలి ఉన్న మాట నిజమే... అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలితాలు మారిపోవు కదా... ఇప్పుడు మా ఫోకస్ అంతా టీ20 సిరీస్ పైనే... ’ అంటూ సమాధానం చెప్పాడు హార్ధిక్ పాండ్యా...

56
Kane Williamson

‘సెమీ ఫైనల్ ఫలితం మమ్మల్ని చాలా బాధపెట్టింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌పైనే ఫోకస్ పెట్టాం. మూడో స్థానం ఎవరిది? అంటే చెప్పడం కష్టం... హార్ధిక్...నువ్వేం అంటావ్? నీ లెక్క ఏంటి...’ అంటూ సమాధానం ఇచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్..

66
Rohit Sharma-Kane Williamson

‘మేం ఫైనల్ ఆడాలని అనుకున్నాం. అయితే అనుకోకుండా ఓ వారం విశ్రాంతి సమయం దొరికింది. పాత విషయాలన్నీ మరిచిపోయి ఈ సిరీస్‌ని ప్రెష్‌గా ఆరంభించాలని అనుకుంటున్నాం..  ’ అంటూ రిప్లై ఇచ్చాడు కేన్ విలియంసన్... 

click me!

Recommended Stories