IPL 2025: వరుస ఓటములు.. సీఎస్కేకు ధోని సర్జరీ.. ముగ్గురు స్టార్లు అవుట్?

Published : Apr 14, 2025, 06:45 PM IST

CSK MS Dhoni's Drastic Rebuild: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్  ప్ర‌ద‌ర్శ‌న‌లు చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేవు. ఈ క్ర‌మంలోనే సీఎస్కే కెప్టెన్ గా తిరిగొచ్చిన ధోని చెన్నై టీమ్ ను రీబిల్డ్ చేసే పనిలో పడ్డాడు.

PREV
15
IPL 2025: వరుస ఓటములు.. సీఎస్కేకు ధోని సర్జరీ.. ముగ్గురు స్టార్లు అవుట్?
IPL 2025: CSK’s Playing XI for LSG Clash – Big Changes Announced

IPL 2025 CSK: ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఛాంపియన్.. కానీ, ఐపీఎల్ 2025లో లో వరుస పరాజయాలతో  చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పాయింట్ల పట్టికలో  చివరి స్థానంలోకి పడిపోయింది. ఆరు మ్యాచ్ లు ఆడితే కేవలం ఒక్క గేమ్ ను మాత్రమే గెలుచుకుంది. సీఎస్కే అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఫ్రాంచైజీ మాత్రం భిన్నమైన వ్యూహాలను రూపొందిస్తోంది. ఎప్పటిలాగే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పెద్ద భారం వేస్తూ మరిన్ని కీలక మార్పులకు సిద్ధమవుతోంది.

25
MS Dhoni’s CSK Makes Tough Calls After KKR Defeat – Who’s In, Who’s Out?

చెన్నై సూపర్ కింగ్స్ కు 5వ ఓటమి

చెన్నై సూపర్ కింగ్స్ చివరగా కోల్ కతా  కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై ఘోర పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోని కెప్టెన్సీలోని చెన్నై టీమ్ కేవలం 103 పరుగులకే పరిమితమైపోయింది. ఈ లక్ష్యాన్ని అజింక్య ర‌హానే నాయ‌క‌త్వంలోని కేకేఆర్  కేవ‌లం 10.1 ఓవర్లలో సాధించి 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో సీఎస్కే ఈ సీజన్‌లో వరుసగా 5వ పరాజయాన్ని నమోదు చేసింది.

ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలోకి ప‌డిపోయింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే దాదాపు  మిగిలి అన్ని మ్యాచ్‌ల్లో విజ‌యాలు కీల‌కం. ఈ నేపథ్యంలో సీఎస్కే వచ్చే మ్యాచ్ ఏప్రిల్ 14న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ కు ముందు  టీమ్ లో కీల‌క మార్పుల‌కు సిద్ధమైంది.

35
CSK Team News: Major Changes Ahead of IPL 2025 Clash vs LSG

చెన్నై టీమ్ నుంచి ముగ్గురు అవుట్.. వీరినా? 

ధోనీ కీలక నిర్ణయాలతో జట్టును పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ స‌ర్కిల్ లో న‌డుస్తున్న టాక్ ప్ర‌కారం.. ముగ్గురు ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌తో గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. వారిలో మొద‌ట‌గా వినిపిస్తున్న పేరు రవిచంద్రన్ అశ్విన్. చెన్నై టీమ్ భారీ మొత్తం వెచ్చించి అశ్విన్‌ను తీసుకున్నా, ఇప్పటివరకు అతను జట్టుకు గొప్ప ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయాడు. పవర్‌ప్లేలో ప‌రుగులు క‌ట్ట‌డి చేయ‌డం లేదు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు కూడా రాణించ‌క‌పోవ‌డంతో ల‌క్నో తో జరిగే మ్యాచ్‌లో అతను జట్టులో ఉండే అవకాశం లేదు.

అశ్విన్ త‌ర్వాత వినిపిస్తున్న పేరు రాహుల్ త్రిపాఠి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతని ప్రదర్శన చాలా నిరాశాజనకంగా ఉంది. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమై 5వ మ్యాచ్‌కి దూరమయ్యాడు. రుతురాజ్ గాయంతో ఆడలేకపోవడంతో త్రిపాఠికి అవకాశం ఇచ్చినా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. రాబోయే మ్యాచ్‌కి అతనిని పక్కన పెట్టే అవకాశాలున్నాయి. 

45
Who Will Play for CSK vs LSG? Full Details of Squad Overhaul

దీపక్ హుడా వ‌రుస‌గా ఫెయిలవుతున్న బ్యాట్స్‌మెన్. చివరి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చినా, డక్‌తో వెనుదిరిగాడు. హుడాను కూడా ధోనీ జట్టులో నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.

చెన్నై ప్లేయింగ్ ప్లేయింగ్ 11 ఎలా వుండ‌నుంది? 

ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను ప్లేయింగ్ 11 నుంచి అవుట్ చేయ‌డంతో పాటు యంగ్ ప్లేయ‌ర్ల‌ను తీసుకోవాల‌ని సీఎస్కే ప్లాన్ చేస్తోంది. అండ్రే సిద్దార్థ్ జ‌ట్టులోకి వ‌స్తాడని స‌మాచారం. CSK కొత్త ప్లేయింగ్ XI లో మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్),  రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, విజయ్ శంకర్,  అండ్రే సిద్దార్థ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, మతీశ పతిరాణ‌, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ లు ఉండ‌నున్నారు.   

 

55
CSK vs LSG: Dhoni Drops 3 Players After Losing Streak, New Playing XI Revealed

బౌలింగ్ విభాగంలో పేస్ విభాగాన్ని అన్షుల్, పతిరాన, ఖలీల్ ముందుకు న‌డిపించ‌నున్నారు. స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్, జడేజా, అవసరమైతే రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర, దేవన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఇద్దరికీ మరో అవకాశం ఇస్తున్నారు.

తరువాత విజయ్ శంకర్ రంగంలోకి దిగుతాడు. అతని తర్వాత యంగ్ ప్లేయ‌ర్ ఆండ్రీ సిద్ధార్థ్ ఉంటాడు. అలాగే, షేక్ రషీద్, శివం దుబే మిడిల్ ఆర్డర్‌లో ఆడతారు. ఆ తర్వాతి ఆర్డ‌ర్ ఛేజింగ్‌లో జడేజా, ధోని బ్యాటింగ్ చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories