IPL 2025: Delhi Capitals vs Mumbai Indians
Karun Nair: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ అద్భుతంగా ఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను కేవలం 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మరీ ముఖ్యంగా ప్రపంచంలోని టాప్ బౌలర్ గా కొనసాగుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను టార్గెట్ చేసి సిక్సర్ల మోత మోగించాడు.
బుమ్రాతో పాటు ముంబై ఇండియన్స్ ఇతర బౌలర్లను చెగుడు ఆడుకున్నాడు. పవర్ ప్లే చివరి ఓవర్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పై అటాక్ చేస్తూ సిక్సర్లు, ఫోర్లు బాదాడు. అతని అద్భుతమైన ఆటను చూసి ప్రేక్షకులతో పాటు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చప్పట్లుకొట్టారు.
206 పరుగుల బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన డీసీ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. కానీ 2022 తర్వాత తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కరుణ్ నాయర్ అభిషేక్ పోరెల్ తో కలిసి దుమ్మురేపే ఇన్నింగ్స్ ను ఆడారు. ఈ జోడీ ఐదు ఓవర్లలోనే యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
అభిషేక్ నాయర్ 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ సమయంలో అతను 222 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లే లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. డీసీ తరఫున పవర్ ప్లే లో హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్ల వివరాలు గమనిస్తే.. జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ 2024లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లోనే 78 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, అదే ఏడాది రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 20 బంతుల్లో 50 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై కరుణ్ నాయర్ 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Karun Nair plays a shot
బుమ్రా బౌలింగ్ ను దంచికొట్టిన కరుణ్ నాయర్
ఆరో ఓవర్ లో బుమ్రా తన రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో కరుణ్ నాయర్ 32 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బుమ్రా వేసిన తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బౌండరీతో ఆ తర్వాత మరో సిక్స్ కొట్టాడు.చివరి బంతికి మరో రెండు పరుగులు కొట్టి కేవలం 22 బంతుల్లోనే కరుణ్ నాయర్ ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. బుమ్రా ఓవర్ లో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఫ్రేజర్-మెక్ గుర్క్ తర్వాత పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ సాధించిన రెండో డీసీ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
బుమ్రా ఓవర్ చివరి బంతికి కరుణ్ నాయర్ 2 పరుగులు తీస్తున్న సమయంలో అతన్ని తాకాడు. అప్పుడు ఇద్దరు వాగ్వాదానికి దిగారు. కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా అసంతృస్తి వ్యక్తిం చేశాడు. ఇది వైరల్ గా మారింది.
చివరికి 12వ ఓవర్లో 89 పరుగుల వద్ద కరుణ్ నాయర్ ను మిచెల్ సాంట్నర్ ఔట్ చేశాడు. 40 బంతుల్లో 5 సిక్సర్లు, 12 ఫోర్లతో తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. పోరెల్ (25 బంతుల్లో 33)తో కలిసి తొలి వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యం ఏర్పడేలా చేశాడు.
అంతకుముందు తిలక్ వర్మ 33 బంతుల్లో 59 పరుగులు చేసి మిడిలార్డర్లో రాణించడంతో ముంబై ఇండియన్స్ 205/5 పరుగులు చేసింది. నమన్ ధీర్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఐపీఎల్ లో బుమ్రా బౌలింగ్ అత్యధిక పరుగులు రాబట్టిన ప్లేయర్లు
26 పరుగులు - ప్యాట్ కమిన్స్ (కేకేఆర్), 2022
20 పరుగులు - డీజే బ్రావో (సీఎస్కే), 2018
18 పరుగులు - కరుణ్ నాయర్ (డీసీ), 2025*
17 పరుగులు - ఫాఫ్ డుప్లెసిస్ (సీఎస్కే), 2021