రిటైర్మెంట్ ప్ర‌క‌టించినా జోరుత‌గ్గ‌ని ధోని.. ఎన్ని కోట్ల బ్రాండ్ విలువో తెలుసా?

First Published Sep 4, 2024, 10:04 AM IST

MS Dhoni : భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చి 4 ఏళ్లు గడిచింది. అయినా అతని బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గలేదు. వంద‌ల కోట్ల రూపాయ‌లు బ్రాండ్ విలువ‌ను క‌లిగివున్నారు. 
 

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ.. ప్ర‌పంచ క్రికెట్ లో అత్యుత్త‌మ కెప్టెన్. భార‌త జ‌ట్టును మూడు ఫార్మాట్ల‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిపాడు. మూడు ఫార్మాట్ల‌లో భార‌త జ‌ట్టుకు ఐసీసీ ట్రోఫీల‌ను అందించాడు. మిస్ట‌ర్ కూల్ గా గుర్తింపు పొందిన  ధోనీ క్రికెట్ లో ఎన్నో ఘనతలను సాధించాడు. ఇది అందరికీ తెలుసు.

అయితే, ధోని క్రికెట్ మంచి గుర్తింపుతో పాటు వేల కోట్ల రూపాయ‌ల‌ను కూడా సంపాదించాడ‌ని మీకు తెలుసా? అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి దాదాపు 4 సంవ‌త్స‌రాల‌కు పైగా అవుతున్నా ధోని క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ఐపీఎల్ లో ఆడుతూ యంగ్ ప్లేయ‌ర్ల‌తో పోటీ ప‌డుతున్నాడు. ఇక సంపాద‌న‌లో ప్ర‌స్తుత‌ స్టార్ క్రికెట‌ర్ల‌తోనూ పోటీ ప‌డుతున్నాడు. 

రిటైర్మెంట్ తర్వాత కూడా ధోనీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు..!

ప్ర‌పంచ క్రికెట్ గొప్ప కెప్టెన్ల‌లో ఒక‌రు ధోని. భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్. ధోని ప్రశాంతమైన ప్రవర్తన, వ్యూహాలు, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. ధోనీకి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి సాక్షి ఐపీఎల్..! చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడుతున్న ధోని అద్భుత‌మైన త‌న కెప్టెన్సీ, ఆట‌తో ఆ జ‌ట్టును విజ‌య‌వంత‌మైన టీమ్ కు ఐపీఎల్ లో ముందుకు న‌డిపించాడు.

ఐదు  సార్లు చెన్నై టీమ్ ను త‌న కెప్టెన్సీలో ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. గ‌త సీజ‌న్ లో ధోని ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. ఐపీఎల్ లో సీఎస్కేకు అంత క్రేజ్ ఉందంటే అది ధోని వ‌ల్ల‌నే అని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం భార‌త్ లోనే కాకుండా అత‌నికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధోని లక్షలాది మంది అభిమానులతో పాటు వేల కోట్లకు అధిపతి కూడా. 

Latest Videos


ప్ర‌పంచ క్రికెట్ లో అత్యంత ధ‌నిక క్రికెట‌ర్ల‌లో ఒక‌రు

ధోనీ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకరు. అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించినా ఇంకా అత‌ని క్రేజ్ త‌గ్గ‌లేదు. బ్రాండ్ విలువ త‌గ్గ‌లేదు. ఇటీవల, ఒక వ్యాపార సంస్థ ధోని బ్రాండ్ విలువను అంచనా వేసింది. దీని ప్రకారం ధోనీ బ్రాండ్ విలువ రూ.766 కోట్లుగా అంచనా. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

వివిధ బ్రాండ్స్ కు ప్ర‌క‌ట‌న‌లు, ఐపీఎల్, ఇత‌ర వ్యాపారాల ద్వారా ధోని భారీగానే సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ లో ఆడుతున్నందుకు సీఎస్కే ధోనికి సంవత్సరానికి 12 కోట్ల రూపాయల వేతనం చెల్లిస్తుంది. అలాగే, ధోనీ 28కి పైగా ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ బ్రాండ్ల కోసం ధోనీ ఒక రోజు యాడ్ షూట్ కోసం రూ.4 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటున్నారు. 

సోషల్ మీడియా సంపాదన కూడా చాలానే ఉంది

ఇక సోషల్ మీడియా ద్వారా ధోనీ కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 25 మిలియన్లకు పైగా ధోనికి ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ రెండు ఖాతాల ద్వారా ధోనీ వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు. ఇందుకోసం ఒక్కో వ్యాపార రిజిస్ట్రేషన్ కు రూ.1 నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు.

అలాగే ధోనీ స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టాడు. తాజాగా ధోనీ సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు. ఇప్పటికే తమిళంలో ఓ చిత్రాన్ని నిర్మించాడు. మరిన్ని ప్రాజెక్టులు కూడా ముందున్నాయి. 

ధోనీ డెహ్రాడూన్ లో రూ.17.8 కోట్ల ఇల్లు 

ధోనీకి ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలమైన రాంచీ, డెహ్రాడూన్‌లలో సొంతంగా ఇల్లు ఉన్నాయి.  డెహ్రాడూన్ హౌస్ విలువ రూ.17.8 కోట్లు, రాంచీలోని ఫామ్ హౌస్ విలువ రూ.6 కోట్లు. అలాగే, ధోని కార్ల గ్యారేజీలో అనేక ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. ఆడి, హమ్మర్, ల్యాండ్ రోవర్, ఫెరారీ, మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్ వంటి అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

ధోని ఇంటి గ్యారేజీలో కార్లతో పాటు వివిధ దిగుమతి చేసుకున్న సూప‌ర్ బైక్‌లు కూడా ఉన్నాయి. అయితే రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నా ధోనీ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న ప్లేయ‌ర్ల‌తో అధిగ‌మించి ధోని బ్రాండ్ విలువ ఉంది. 

ధోనీ బహుముఖ కెరీర్, స్మార్ట్ బిజినెస్ వెంచర్ల వల్ల రూ.1,040 కోట్ల విలువైన నికర సంపదను సంపాదిస్తున్నారు. దీంతో క్రీడా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా, అత్య‌ధిక సంపాద‌న క‌లిగిన ఆట‌గాళ్ల‌లో ఒకరిగా నిలిచారు.

అతని బ్రాండ్ ఎండార్స్మెంట్లు సుమారు $27 మిలియన్లను తెస్తాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్లలో ఒకరిగా ధోనిని నిల‌బెట్టింది.

click me!