ధోనీ 4 సార్లు, రోహిత్ 3 సార్లు, గంగూలీ, అజారుద్దీన్ రెండేసి సార్లు... ఆసియా కప్‌లో టీమిండియా కెప్టెన్లు వీరే..

First Published Aug 19, 2023, 12:32 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేసింది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వెస్టిండీస్ టూర్‌ నుంచి వచ్చిన హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్ అండ్ కో.. త్వరలో బెంగళూరులోని ఎన్‌సీఏలో బీసీసీఐ క్యాంపులో చేరబోతున్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది మూడో ఆసియా కప్...

2018లో విరాట్ కోహ్లీ పెళ్లి తర్వాత రెస్ట్ తీసుకోవడంతో ఆసియా కప్ టోర్నీకి సారథ్యం చేశాడు రోహిత్ శర్మ. ఆ టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించి.. ఏడోసారి ఆసియా కప్ టైటిల్‌ని కైవసం చేసుకుంది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2022 ఆసియా కప్ ఆడిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించింది..

40 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసియా కప్‌లో టీమిండియాని 8 మంది కెప్టెన్లు నడిపించారు. 1984లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడిన భారత జట్టు, ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసి మొట్టమొదటి టైటిల్ విజేతగా నిలిచింది..

Latest Videos


1986 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా పాల్గొనలేదు. దీనికి కారణం ఆసియా కప్ 1986 టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంకతో సంబంధాలు దెబ్బ తినడమే. దీంతో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఆసియా కప్ ఆడాయి. ఆతిథ్య శ్రీలంక, టైటిల్ విజేతగా నిలిచింది..

1988 ఆసియా కప్‌లో భారత జట్టును దిలీప్ వెంగ్‌సర్కార్ నడిపించాడు. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆడిన ఈ టోర్నీ ఫైనల్‌లో లంకను ఓడించి, రెండోసారి టైటిల్ గెలిచింది టీమిండియా... 

1990-91 ఆసియా కప్‌కి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీ సమయంలో ఇండియా- పాక్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో పాకిస్తాన్ ఆడలేదు.  ఫైనల్‌లో శ్రీలంకను వరుసగా రెండోసారి ఓడించి, మూడోసారి టైటిల్ గెలిచింది భారత జట్టు. 1990-91 ఆసియా కప్‌కి మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు..

1995 ఆసియా కప్ కూడా అజారుద్దీన్ కెప్టెన్సీలోనే ఆడింది భారత జట్టు. ఆసియా కప్‌లో రెండు సార్లు టీమిండియాకి కెప్టెన్సీ చేసిన మొట్టమొదటి సారిథిగా నిలిచాడు అజారుద్దీన్. 1997 ఆసియా కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్‌లో శ్రీలంక చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా..

2000వ సంవత్సరంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడిన భారత జట్టు, ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి, పాకిస్తాన్ మొదటిసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది..2004 ఆసియా కప్‌లోనూ సౌరవ్ గంగూలీయే సారథిగా వ్యవహరించాడు. ఫైనల్‌లో టీమిండియాపై 25 పరుగుల తేడాతో గెలిచింది శ్రీలంక.. 

2008 ఆసియా కప్ టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్‌లో శ్రీలంక చేతుల్లో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఆ తర్వాత 2010 ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంకను 81 పరుగుల తేడాతో ఓడించి రివెంజ్ తీర్చుకుంది ధోనీ టీమ్...

2012 ఆసియా కప్‌లోనూ ధోనీయే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్, రెండోసారి టైటిల్ విజేతగా నిలవగా బంగ్లాదేశ్ రన్నరప్‌గా నిలిచింది. శ్రీలంక, టీమిండియా ఫైనల్ కూడా చేరలేకపోయాయి...

Virat Kohli

2014 ఆసియా కప్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోనీ గాయంతో తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ, టీమ్‌ని ఫైనల్ కూడా చేర్చలేకపోయాడు. శ్రీలంక  ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించి ఐదోసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది..

2016లో మళ్లీ ధోనీ కెప్టెన్సీలో ఆసియా కప్ టోర్నీ ఆడింది టీమిండియా. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు.

Asia Cup 2018

ఆ తర్వాత 2018లో, 2022లో రోహిత్ శర్మ... ఆసియా కప్‌లో భారత సారథిగా వ్యవహరించాడు. 2023 ఆసియా కప్ అతనికి కెప్టెన్‌గా మూడో ఆసియా కప్..  

click me!