నా బాడీ చెబుతుంది... IPL రిటైర్మెంట్ పై ధోని ఏం చెప్పాడంటే?
MS Dhoni Retirement: ఐపీఎల్ 2025లో ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. తను రిటైర్ అవుతాడా లేదా అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
MS Dhoni Retirement: ఐపీఎల్ 2025లో ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. తను రిటైర్ అవుతాడా లేదా అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
MS Dhoni Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయాక మహేంద్ర ధోనీ రిటైర్మెంట్ పై చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఇదివరకు కూడా ధోనీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని అన్నారు. కానీ ఐపీఎల్ 2025లో తన ఆట సరిగ్గా లేకపోవడంతో మళ్లీ ఈ వార్త వైరల్ అవుతోంది. చాలా రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ తనకి చివరిది అవుతుంది. అయితే ధోనీనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రిటైర్మెంట్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
రాజ్ షమనితో మాట్లాడుతూ ధోనీ ఇంకా ఆటకి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోనని అన్నాడు. ఐపీఎల్ 2025 అయిపోయాక కూడా రిటైర్మెంట్ గురించి తొందరపడను అని చెప్పాడు. "నేను ఏడాదికి ఒక్కసారే ఐపీఎల్ ఆడుతున్నాను. నా వయసు 43 ఏళ్లు. ఈ IPL సీజన్ అయ్యేసరికి నా వయసు 44 అవుతుంది. ఇంకా 10 నెలలు ఉంది. అప్పుడు ఇంకో సీజన్ ఆడాలా వద్దా అని ఆలోచిస్తాను. ఆడటానికి బాడీ సహకరిస్తుందా లేదా అనేది చూడాలి" అని ధోనీ చెప్పాడు.
IPL 2025లో ధోనీ బ్యాటింగ్ చూడాలని CSK ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు తను 4 మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. ఒక మ్యాచ్‌లో అయితే ధోనీ 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. RCBతో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మొత్తం 4 ఇన్నింగ్స్‌లలో 0*, 30*, 16, 30 రన్స్ చేశాడు. కొన్ని మ్యాచ్‌లలో బ్యాటింగ్ లో పెద్దగా పరుగులు చేయకపోయినా.. ధోనీ కీపింగ్‌లో మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను కళ్లు చెదిరే స్టంప్ అవుట్ చేశాడు.