ఆసియాకప్ తో ధోనీకి ఉన్న సంబంధం ఇదే..!

First Published Aug 31, 2023, 3:06 PM IST

ఎందుకంటే, ఆయన ఆసియా కప్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నాడు. మరి అవేంటో ఓసారి మనమూ చూద్దాం..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి స్పెషల్ గా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనే పేరు తెలిసినవారందరికీ ధోనీ సుపరిచితమే. కెప్టెన్ గా ఆయన టీమిండియాకు అందించిన సేవలు అనంతం.

ధోనీ కెప్టెన్సీలోనే మనం  వన్డే, టీ20, ఛాంపియన్ ట్రోఫీలు అందాయి. ఇక, ఐపీఎల్ లోనూ తన టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ని దాదాపు ఐదుసార్లు గెలిపించిన ఘనత ఆయనది. అయితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆసియా కప్ అనగానే క్రికెట్ ప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది ధోనీనే. ఎందుకంటే, ఆయన ఆసియా కప్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నాడు. మరి అవేంటో ఓసారి మనమూ చూద్దాం..

Latest Videos


2004లో అంతర్జాతీయ కెరీర్‌లోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని, తొలిసారిగా 2007 టీ20 ప్రపంచ కప్ నుంచి కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు. కేవలం మూడేళ్లకు ఆయనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆయన కెప్టెన్సీలోనే తొలిసారి టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 

మంచి వికెట్ కీపర్ లేని లోటు కూడా ధోనీ తీర్చాడు. ఈ ట్రోఫీ ఫలితంగా 2008లో జరిగిన ఆసియా కప్ లోనూ భారత్ కు కెప్టెన్ గా ధోనీనే వ్యవహరించాడు. ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టు, ఆ ఏడాది రన్నరప్‌గా నిలిచింది.
 

2008 ఆసియా కప్ తర్వాత మళ్లీ రెండేళ్లకు మినీ టోర్నీ వచ్చేసింది. ఈసారి కూడా ధోనినే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాకుండా, పరుగులు కూడా చేసేవాడు. ఆ తర్వాత  2010 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి తొలిసారి ధోని నాయకత్వంలో టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది. 

ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియాకు 2012లో ఊహించని షాక్ తగిలిందని చెప్పొచ్చు. పాకిస్తాన్, శ్రీలంక మీద అద్భుతంగా విజయం సాధించినప్పటికీ, బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది.  ఆ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్,ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కు చేరిన బంగ్లాదేశ్,పాకిస్థాన్ చేతిలో ఒటమిపాలైంది.

ఇక, ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా తన కెరీర్ లో ఆసియా కప్ టోర్నీలో మొత్తం 14 మ్యాచులకు కెప్టెన్ గా నాయకత్వం వహించాడు.  వాటిలో 9 విజయాలు కాగా, 4 ఓటమిలు, ఒక మ్యాచ్ డ్రా గా మిగిలిపోయింది.  ఆసియా కెప్టెన్లలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా ధోనీ పేరు ఇప్పటికీ రికార్డుల్లో నిలిచిపోయింది. 

click me!