ఆసియా కప్ సమరం.. భార్యతో బుమ్రా ఫుట్ బాల్..!, కోహ్లీని కంట్రోల్ చేయాల్సిందే

Published : Aug 31, 2023, 01:32 PM ISTUpdated : Aug 31, 2023, 01:43 PM IST

ఈ క్రమంలో కొంచెం గ్యాప్ దొరకడంతో తన భార్య సంజనా గణేశన్ తో కలిసి ఆన్ లైన్ లో ఫుట్ బాల్ గేమ్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటజన్లను ఆకట్టుకుంటోంది.

PREV
16
ఆసియా కప్ సమరం.. భార్యతో బుమ్రా ఫుట్ బాల్..!, కోహ్లీని కంట్రోల్ చేయాల్సిందే

వరల్డ్ కప్ సమరం మొదలవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ ఎలాగైనా సాధించాలని టీమిండియా చాలా పట్టుదలతో ఉంది. లోగా ఆసియా కప్ సమరం మొదలౌతోంది. మరో రెండు రోజుల్లో ఈ ఆసియా కప్ మొదలౌతోంది. అయితే, దీనిలో భాగంగా పాకిస్థాన్ , భారత్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కోసం ఇటు భారత్, అటు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఆసియా కప్ 2023 నేపథ్యంలో కొన్ని క్రికెట్ విశేషాలు తెలుసుకుందాం..

26

ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ తో దాదాపు సంవత్సరం తర్వాత బుమ్రా  అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇక, ఈ ఐర్లాండ్  సిరీస్ లో అదరగొట్టాడు. ఇప్పుడు ఆసియా కప్ కోసం సిద్ధమౌతున్నాడు. ఈ క్రమంలో కొంచెం గ్యాప్ దొరకడంతో తన భార్య సంజనా గణేశన్ తో కలిసి ఆన్ లైన్ లో ఫుట్ బాల్ గేమ్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటజన్లను ఆకట్టుకుంటోంది.

36

ఇక, ఈ ఆసియా కప్ లో పాకిస్తాన్ తో తలపడటం పై మహ్మద్ కైఫ్ మాట్లాడారు. గత ఏడాది జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై కోహ్లీ అద్భుతంగా ఆడాడని గుర్తు చేశారు. కోహ్లీకి బౌలింగ్ చేస్తున్నప్పుడు పాకిస్థాన్ బౌలర్లు ఒత్తిడికి గురవుతారన్నారు. 2022 ట్వంటీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ధాటిగా ఆడి టీమిండియాను గెలిపించిన క్షణాలు పాక్ బౌలర్ల మదిలో మెదులుతుంటాయన్నాడు. పాక్‌తో మ్యాచ్ అంటే కోహ్లీ చాలా ప్రమాదకరంగా ఉంటాడని చెప్పాడు.

46

ఇక, ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ లేకపోవడం బాధాకరం అని ఆయన అన్నారు. కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్ లకు దూరమౌతున్నాడని కైఫ్ చెప్పారు. ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకూ అందుబాటులో ఉండటమే కష్టంగానే ఉందన్నారు. కేఎల్ రాహుల్ లేకపోవడం టీమిండియా కు బ్యాడ్ న్యూసేనన్నారు. కేఎల్ రాహుల్ అవసరమైన సమయంలో భారీ షాట్స్  ఆడగలడని, కాబట్టి, రాహుల్ లేకపోవడం లాస్ అవుతుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

56

Brad Hogg

ఇదిలా ఉండగా, భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్ హాగ్ స్పందించారు. తాను కూడా భారత్- పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ బౌలింగ్ కు, టీమిండియా బ్యాటింగ్ కి మధ్య పోటీ  ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  పాక్ బౌలింగ్ బాగుంటుందని, టీమిండియాలో స్టార్ బ్యాట్సెమన్స్ ఉన్నారని అన్నారు.

66

అయితే, పాక్ పేసర్ షహీన్ అఫ్రిది మంచి ఫామ్ లో ఉన్నాడన్నారు. అతన్ని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని చెప్పాడు. ఇక, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని కంట్రోల్ చేయకపోతే, పాకిస్తాన్ కి చాలా కష్టమౌతుందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డారు.

click me!

Recommended Stories