2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో విరాట్ కోహ్లీతో మాట్లాడా! చాలా గర్వంగా ఉంది.. - బాబర్ ఆజమ్

Published : Aug 31, 2023, 02:18 PM IST

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. గత 22 వన్డేల్లో 17 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన బాబర్ ఆజమ్, వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు అందుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..   

PREV
17
2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో విరాట్ కోహ్లీతో మాట్లాడా! చాలా గర్వంగా ఉంది.. - బాబర్ ఆజమ్

గత 22 వన్డేల్లో నెదర్లాండ్స్‌పై 3, జింబాబ్వేపై 3, ఆఫ్ఘాన్‌పై 3 మ్యాచులు ఆడిన బాబర్ ఆజమ్, స్వదేశంలో న్యూజిలాండ్‌పై 5 వన్డేలు ఆడాడు. వెస్టిండీస్, శ్రీలంక ఇలా గత రెండేళ్లలో బాబర్ ఆజమ్, వన్డేల్లో ఎదుర్కొన్న పటిష్టమైన జట్టు సౌతాఫ్రికా ఒక్కటే..

27

నేపాల్‌తో జరిగిన వన్డేలో 151 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆసియా కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ తర్వాత 150+ స్కోరు బాదిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, 2012 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 183 పరుగులు చేశాడు. 

37

‘విరాట్ కోహ్లీ, నా గురించి చేసిన వ్యాఖ్యలు నాకు ఎంతో గర్వకారణం. ఆయన మాటలు చాలా మంచిగా అనిపించాయి. విరాట్ లాంటి ప్లేయర్, తోటి ప్లేయర్‌ని పొడిగితే అవి ఎంతో ఎనర్జీని నింపుతాయి..
 

47
Virat Kohli-Babar Azam

2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో విరాట్ కోహ్లీని మొదటిసారి కలిశాను. అతను అప్పుడు పీక్ స్టేజీలో ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. విరాట్ నుంచి ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నించా...
 

57
Virat Kohli-Babar Azam

విరాట్ ఎంతో ఓపిగ్గా నేను అడిగిన ప్రతీదానికి సమాధానం ఇచ్చాడు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. విరాట్ ఇచ్చిన సలహాలు నా క్రికెట్ కెరీర్‌లో చాలా ఉపయోగపడ్డాయి..’ అంటూ కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్..

67

‘2019 వన్డే వరల్డ్ కప్‌ సమయంలో మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్ సమయంలో బాబర్ ఆజమ్‌తో మొదటిసారి మాట్లాడాను..అండర్19 వరల్డ్ కప్ నుంచే ఇమాద్ వసీంతో నాకు పరిచయం ఉంది. అతను వచ్చి, బాబర్ ఆజమ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. మేం ఇద్దరం కూర్చొని, చాలా సేపు మాట్లాడుకున్నాం. బాబర్ చాలా వినయంగా ఉంటాడు..

77

సీనియర్లను ఎంతగానో గౌరవిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో బాబర్ ఆజమ్ వరల్డ్ టాప్ బ్యాటర్లలో ఒకడనే విషయాన్ని మరిచిపోకూడదు. అతని ఆటను చూడడానికి నేను కూడా ఇష్టపడతాను..’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..

Read more Photos on
click me!

Recommended Stories