IPL 2025: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై ధోని కామెంట్స్ వైరల్.. ఏం చెప్పాడంటే?
MS Dhoni on IPL Impact Player Rule: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
MS Dhoni on IPL Impact Player Rule: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
MS Dhoni on IPL Impact Player Rule: క్రికెట్ సందడి మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తో ప్రస్తుతం క్రికెట్ జాతర అదిరిపోతోంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌లో సొంతగడ్డపై 28న ఆర్సీబీతో తలపడుతుంది. అయితే, ఐపీఎల్ మ్యాచ్‌లలో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి
ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై జియోహాట్‌స్టార్ లో ధోని మాట్లాడుతూ ''ఇంపాక్ట్ రూల్ పెట్టినప్పుడు, అది నిజంగా అవసరం లేదని అనిపించింది. కానీ ఇది నాకు ఒక విధంగా హెల్ప్ చేస్తుంది. కానీ నేను ఇంకా వికెట్ కీపింగ్ చేస్తున్నాను. అందుకే నేను ఇంపాక్ట్ ప్లేయర్ కాదు'' అని చెప్పాడు.
అలాగే, ''ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఎక్కువ స్కోర్లు వస్తున్నాయని చాలామంది అంటున్నారు. పరిస్థితులు, ఆటగాళ్ల సౌకర్యం వల్ల ఇది ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. కొట్టే రన్స్ ఒక ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ వల్ల మాత్రమే కాదు. ఇది మైండ్‌సెట్ గురించి, టీమ్స్‌కు ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్ ఉన్నాడనే ధైర్యం ఉంది, అందుకే వాళ్లు చాలా దూకుడుగా ఆడుతున్నారు'' అన్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ నియమం నిజమైన ఆల్-రౌండర్ల అవసరాన్ని గణనీయంగా తగ్గించిందని ధోని పేర్కొన్నాడు. మ్యాచ్ పరిస్థితి ఆధారంగా బౌలర్‌తో బ్యాటర్‌ను లేదా బ్యాటర్ తో బౌలర్ ను భర్తీ చేసే ఎంపికతో, జట్లు రెండు నైపుణ్యాల సమతుల్యతను అందించే ఆటగాళ్లను ఎంచుకోవడానికి తక్కువ మొగ్గు చూపుతాయి. ఇది అటువంటి ఆటగాళ్ల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ధోని అభిప్రాయపడ్డారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏంటి?
ఐపీఎల్ మ్యాచ్‌లలో 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే రూల్ వాడుతున్నారు. ఒక క్రికెట్ టీమ్‌లో ప్లేయింగ్ లెవెన్ అంటే 11 మంది ఆడే ప్లేయర్స్ ఉంటారు. ఇది రూల్. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే రెగ్యులర్ ఆడే 11 మంది ప్లేయర్స్‌తో పాటు, ఇంకా 5 మంది ప్లేయర్స్‌ను టాస్ వేసేటప్పుడు ఆ టీమ్స్ చెప్పాలి. ఈ 5 మంది ప్లేయర్స్‌లో ఎవరినైనా అవసరానికి తగ్గట్టు టీమ్‌లో వాడుకోవచ్చు.
అంటే ఈ 5 మంది ప్లేయర్స్‌లో ఒకరిని ఒక బౌలర్‌కు బదులుగా బ్యాట్స్‌మెన్‌గా లేదా బ్యాట్స్‌మెన్‌కు బదులుగా బౌలర్‌గా వాడుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఐపీఎల్ టీమ్స్‌కు ఎక్స్‌ట్రాగా ఒక బ్యాట్స్‌మెన్ లేదా ఒక బౌలర్ దొరుకుతారు. ఐపీఎల్ 2023 నుంచి మొదలుపెట్టిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసేయాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి సీనియర్ క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొనడం గమనార్హం.