IPL records: ఐపీఎల్ హిస్ట‌రీలో యంగెస్ట్ కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

youngest IPL captains: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)2025 చాలా మంది యంగ్ ప్లేయ‌ర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ ఎంట్రీ అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను కేవలం 23 సంవత్సరాల వయసులో కెప్టెన్సీ పొందాడు. అయితే, ఐపీఎల్ హిస్ట‌రీలో టాప్-5 అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు (యంగెస్ట్ కెప్టెన్లు) ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Do you know who is the youngest captain in ipl history? Top 5 youngest IPL captains details in telugu rma
Shashank Singh and Shreyas Iyer (Photo: IPLBCCI)

5. శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్ 2018 సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో అతని వయస్సు 23 సంవత్సరాల 142 రోజులు. ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ 5వ స్థానంలో ఉన్నాడు. అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు.

Do you know who is the youngest captain in ipl history? Top 5 youngest IPL captains details

4. రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ రెగ్యులర్ కెప్టెన్‌. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శాంసన్ గాయపడ్డాడు. దీని కారణంగా ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌కు ఆర్ఆర్ జట్టు నాయకత్వం వహించాడు. అతని ప్రస్తుత వయస్సు 23 సంవత్సరాల 133 రోజులు. అతను ఐపీఎల్‌లో నాల్గవ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ గా నిలిచాడు.


Do you know who is the youngest captain in ipl history? Top 5 youngest IPL captains details

3. సురేష్ రైనా

భారత మాజీ  స్టార్ ప్లేయర్ సురేష్ రైనా కూడా చాలా చిన్న వయసులోనే ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతనికి కేవలం 23 సంవత్సరాల 112 రోజుల వయసులో ఐపీఎల్ కెప్టెన్ గా చేశాడు. ఎంఎస్ ధోని అందుబాటులో లేని సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు సురేష్ రైనా తాత్కాలిక కెప్టెన్ గా చేశాడు. గుజరాత్ లయన్స్‌కు జట్టు  పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగాడు. ఐపీఎల్ చరిత్రలో రైనా మూడవ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్. 

Steve Smith and Glenn Maxwell (Photo: ICC)

2. స్టీవ్ స్మిత్ 

ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనదైన ముద్ర వేశాడు. అతను కేవలం 22 సంవత్సరాల 344 రోజుల్లోనే ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతను రెండవ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌. స్మిత్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్  కు కెప్టెన్ గా చేశాడు. 

Do you know who is the youngest captain in ipl history? Top 5 youngest IPL captains details

1. విరాట్ కోహ్లీ

ఐపీఎల్ లో యంగెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. 2011లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ కు నాయకత్వం వహించాడు. ఆ సమయంలో కోహ్లీ వయస్సు 22 సంవత్సరాల 187 రోజులు. కెప్టెన్ గా, ప్లేయర్ గా ఆర్సీబీ కోసం అనేక గొప్ప ఇన్నింగ్స్ లను ఆడాడు. 2016 సంవత్సరంలో కోహ్లీ తన కెప్టెన్సీ లో ఆర్సీబీని ఫైనల్స్‌కు కూడా తీసుకెళ్లాడు, కానీ ఆ జట్టు ట్రోఫీకి కేవలం ఒక అడుగు దూరంలోనే నిలిచిపోయింది.

Latest Videos

vuukle one pixel image
click me!