Aniket Verma
అనికేత్ వర్మ : సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో మరో యువకెరటం చేరింది. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపుపొందిన అనికేత్ వర్మ ఎస్ఆర్‌హెచ్ లో చేరడంలో మరింత బలం పెరిగింది. ఆరెంజ్ ఆర్మీ సొంత గ్రౌండ్ ఉప్పల్ లోనే అనికేత్ మొదటి ఐపిఎల్ మ్యాచ్ ఆడాడు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన అనికేత్ మంచి ఆల్ రౌండర్. మంచి హిట్టర్ మాత్రమే కాదు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా. అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే ఇతడు టీ20 లకు సరిగ్గా సరిపోతాడు... మరీముఖ్యంగా ఐపిఎల్ లాంటి లీగ్స్ లో సత్తాచాటే దమ్మున్న ఆటగాడు. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ టీంలో మరో హిట్టర్ చేరాడు.
డొమెస్టిక్ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున ఆడాడు అనికేత్. అండర్ 23 టోర్నమెంట్ లో అద్భుత సెంచరీతో ఇతడి ట్యాలెంట్ బైటపడింది. ఆ తర్వాత ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్ లో మరో సెంచరీ సాధించాడు. ఇలా అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనికేత్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో అతడిని బరిలోకి దింపుతోంది... టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఆడతాడేమో చూడాలి.
Abhinav Manohar
అభినవ్ మనోహర్ : సన్ రైజర్స్ హైదరాబాద్ లోని మరో ఆల్ రౌండర్ అభినవ్ మనోహర్. ఇతడు దేశవాళి క్రికెట్ లో విధ్వంసకర బ్యాట్ మెన్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఇతడు కేవలం 42 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగుల బాదాడు. ఇలా ధనాధన్ బ్యాటింగ్ తో మ్యాచ్ ను ములుపుతిప్పగల సత్తా కలిగిన ఆటగాడు అభినవ్.
ఇతడు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు... ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసివచ్చే అంశం. అభినవ్ విధ్వంసం గురించి తెలిసిన ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ తొలి మ్యాచ్ లో అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్ డకౌట్ అయ్యాడని చింతిచాల్సిన అవసరం లేదు... తనదైన రోజు ఆకాశమే హద్దుగా చెలరేగే సత్తా కలిగిన ఆటగాడు అభినవ్.
హిట్టర్లలో కూడిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో అభినవ్ రూపంలో మరో మాస్ బ్యాట్ మెన్ దొరికాడు. ఇతడు ఆట మరో హెడ్, అభిషేక్ వర్మ, క్లాసేన్ లను పోలివుంటుంది. వారి మాదిరిగే ఇతడు కూడా ఫార్మ్ అందుకుని చెలరేగితే ప్రత్యర్థులకు ఇక దబిడిదిబిడే.