రోహిత్ శర్మ కాదు, ఆ ఇద్దరిలో ఒకరికి టీ20 కెప్టెన్సీ... సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published Sep 17, 2021, 9:17 AM IST

భారత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాలని నిర్ణయం తీసుకుని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, టీ20ల్లో కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు ప్రకటించాడు. మరి టీ20ల్లో భారత జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు?

ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచి, టీ20 ఫార్మాట్‌లో తనకి తిరుగులేదని నిరూపించుకున్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ దక్కడం దాదాపు ఖాయమే...

2018లో ఆసియా కప్‌ టోర్నీ గెలిచిన సమయంలోనే టీమిండియా కెప్టెన్సీ ఇస్తే, ఆ బాధ్యతలు తీసుకోవడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ కంటే యంగ్ ప్లేయర్లకు టీ20 కెప్టెన్సీ ఇస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని కామెంట్ చేశాడు...

‘రోహిత్ శర్మ చాలా సీనియర్. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. అతనికి టీ20 కెప్టెన్సీ ఇవ్వడం సరైనదే. అయితే అతని వయసు దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం... రోహిత్ ఎక్కువకాలం క్రికెట్‌లో కొనసాగే అవకాశం లేదు...

34 ఏళ్ల రోహిత్, ఇంకెన్నాళ్లు క్రికెట్‌లో కొనసాగుతాడనేది చెప్పలేం. మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమేనని నా అభిప్రాయం. అలాంటప్పుడు రోహిత్‌కి కెప్టెన్సీ ఇవ్వడం కంటే, కొత్త కెప్టెన్‌ని ఎంచుకుంటే బెటర్...

టీమిండియా కెప్టెన్ కెప్టెన్‌ని వెతకాలని అనుకుంటే... కెఎల్ రాహుల్ మంచి కెప్టెన్. ఇంగ్లాండ్‌లాంటి పిచ్‌లపై కూడా అతను చక్కగా రాణించాడు... 

ఐపీఎల్‌లో, వన్డేల్లో కూడా కెఎల్ రాహుల్ చక్కగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ మంచి కెప్టెన్సీ స్కిల్స్ చూపించాడు...

రిషబ్ పంత్ కూడా సారథిగా మంచి ప్రావీణ్యం చూపిస్తున్నాడు. అయితే అతనికి పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు... పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

నిజానికి గత జనవరి, ఫిబ్రవరి వరకూ టీమిండియా తర్వాతి సారథి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు వినిపించింది...

Shreyas Iyer

అయితే ఎప్పుడైతే అతను ఇంగ్లాండ్ సిరీస్‌లో గాయపడి, జట్టుకి దూరమయ్యాడో గణాంకాలన్నీ పూర్తిగా మారిపోయాయి... 

 రిషబ్ పంత్, ఢిల్లీ కెప్టెన్‌గా అదరగొట్టడం, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో అటు టీమిండియాకి, ఇటు ఢిల్లీ జట్టు కెప్టెన్సీకి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్...

click me!