ధోని తొలి పాడ్‌కాస్ట్ ను ప్రఖ్యాత కంటెంట్ సృష్టికర్త రాజ్ షమానీ మోడరేట్ చేశాడు. అతనికి తన సొంత పాడ్‌కాస్ట్ కూడా ఉంది. కానీ, ధోని పాడ్‌కాస్ట్ కేవలం ధోని యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చాట్ సమయంలో ధోనిని "ఒక ఓపెనింగ్ పెయిర్, ఒక బౌలింగ్ స్పెల్, ఒక ఆల్ రౌండర్" లలో మీరు ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా.. దానికి ధోని విచిత్రమైన సమాధానంతో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
"చూడండి, మీరు వారు ఆడటం చూసినప్పుడు, వారి కంటే ఎవరూ మెరుగ్గా ఉండలేరని మీకు అనిపిస్తుంది. కానీ క్రికెట్ అనేది హెచ్చుతగ్గులకు లోనయ్యే ఆట. ఉత్తమ ఓపెనర్‌ను ఎంచుకోవడం చాలా కష్టం, కానీ నేను వారు ఆడటం చూశాను. యూవరాజ్ (యూవీ) 6 సిక్సర్లు కొట్టినప్పుడు, నేను మరెవరినీ చూడవలసిన అవసరం లేదు. నేను ఒక ఆటగాడిని ఎందుకు ఎంచుకోవాలి? జట్టుకు చాలా మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు ఉన్నారు. అవును, ఇంతకు ముందు.. ఇలాంటి కవరేజ్ లేదు. గతంలో కూడా నాకు తెలియని ఇలాంటి ప్రదర్శనలు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ చేయబడవు. నేటి తరానికి వాటి గురించి తెలియదు" అని ధోని పాడ్‌కాస్ట్ సందర్భంగా రాజ్ షమానీతో అన్నారు.