జ్వరంతో పడుకుంటే, లేపి బ్యాటింగ్ చేయమన్నారు! 2015 వన్డే వరల్డ్ కప్‌ సెంచరీపై ఏబీ డివిల్లియర్స్...

Published : Jul 01, 2023, 01:05 PM IST

మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిల్లియర్స్ క్రీజులో ఉంటే ఎలాంటి మ్యాచ్‌నైనా గెలిపించగలడు. చేతులు జారిపోయిన మ్యాచ్‌ని అయినా మలుపు తిప్పగలడు. అందుకే అతన్ని మిస్టర్ డిపెండబుల్ అంటారు. ఏబీడీ ఆడిన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 2015 వరల్డ్ కప్‌లో విండీస్‌పై చేసిన 162 పరుగులు ఒకటి..

PREV
19
జ్వరంతో పడుకుంటే, లేపి బ్యాటింగ్ చేయమన్నారు! 2015 వన్డే వరల్డ్ కప్‌ సెంచరీపై ఏబీ డివిల్లియర్స్...
AB de Villiers

ఫిబ్రవరి 27న సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డి కాక్ 12 పరుగులు చేయగా హషీం ఆమ్లా 65, ఫాఫ్ డుప్లిసిస్ 62, రిలే రసో 61 పరుగులు చేసి అవుట్ అయ్యారు..
 

29

AB de Villiers

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఏబీ డివిల్లియర్స్ 66 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 పరుగులు చేసి బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడు. విండీస్‌పైనే 31 బంతుల్లో సెంచరీ బాది, వన్డేల్లో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఏబీ డివిల్లియర్స్ దెబ్బకు చివరి 20 ఓవర్లలో 264 పరుగులు రాబట్టింది సౌతాఫ్రికా..

39
Dale Steyn-AB de Villiers

లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 151 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇమ్రాన్ తాహీర్ 5 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాకి 257 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌ గురించి తాజాగా మాట్లాడాడు ఏబీ డివిల్లియర్స్..

49

‘వెస్టిండీస్‌తో మ్యాచ్‌కి ముందు నేను చాలా ఇబ్బందికి ఫీలయ్యా. అది మాకు తప్పక గెలవాల్సిన మ్యాచ్. తెల్లవారుజామున 3 గంటలకు నా ఫుల్లుగా జ్వరం వచ్చేసింది. మూడు నాలుగు ఇంజెక్షన్లు వేయించుకున్నా... 
 

59

ఆ రాత్రంతా ఇబ్బందిపడుతూ నిద్ర పోలేదు. మ్యాచ్‌కి ముందు సిడ్నీ గ్రౌండ్‌కి వెళ్లగానే వార్మప్ కూడా చేయలేనని, పడుకోవడానికి వెళ్తున్నానని కోచ్‌తో చెప్పాను. ఒకవేళ ఆడలేకపోతే తప్పుకోమ్మని ఆయన చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో తెలిసీ తప్పుకోవడం కరెక్ట్ కాదని చెప్పా..

69

తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో నా బ్యాటింగ్ వచ్చే వరకూ పడుకున్నా. ఫాఫ్ డుప్లిసిస్ వికెట్ పడగానే నన్ను లేపారు. సగం నిద్రలో ఉన్నా. క్రీజు దాకా నడవగలనా? బ్యాటింగ్ చేయగలనా? అనిపించింది..

79

మొండిగా లేచి బయలుదేరా. నా మొదటి బాల్‌ ఎదుర్కొన్నప్పుడు అది ఎప్పుడు వచ్చిందో కూడా కనిపించలేదు. రెండో బంతి స్లో మోషన్‌లో మెల్లిగా వస్తున్నట్టు కనిపించింది. అప్పుడు నేను అవుటైపోయినా పర్లేదని వదిలేశా..

89

ఎండ మండుతోంది. ఓపిక లేదు, కళ్లు మూతపడుతున్నాయి. చుట్టూ అభిమానుల కేకలు. అంతా ఓ కలలో ఉన్నట్టు అనిపించింది. మెల్లిగా ఒక్కో బాల్ ఆడుతూ గేమ్‌లోకి వెళ్లా. ఆ తర్వాత కసిగా కొట్టడం మొదలెట్టా...

99

నిజానికి ఆ రోజు నేను అవుటైపోతాననే భయాన్ని మోయలేదు, అవుటైపోయినా పర్లేదని చాలా స్వేచ్ఛగా ఆడా. ఆ ఇన్నింగ్స్‌కి కారణం అదేనేమో. మ్యాచ్ తర్వాత స్కోర్ బోర్డు చూసి షాక్ అయ్యా. అలా ఆడింది నేనేనా అనిపిస్తూ ఉంటుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్.. 

click me!

Recommended Stories