టార్గెట్ 673! సచిన్ టెండూల్కర్ రికార్డును కొట్టేదెవరు? అందరి మదిలో అల్లుడి పేరు...

First Published | Sep 30, 2023, 4:19 PM IST

ఐపీఎల్ 2016లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డుకి చాలా మంది చేరువగా వచ్చినా అందుకోలేకపోయారు. అలాగే 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డు కూడా ఇప్పటిదాకా ఏ క్రికెటర్ అందుకోలేకపోయాడు..
 

rohit sharma record

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా 5 సెంచరీలు బాది, వరల్డ్ రికార్డు కొట్టిన రోహిత్ శర్మ... మొత్తంగా 648 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతనితో పోటీపడిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 647 పరుగులు మాత్రమే చేశాడు...

అయితే 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ పిచ్‌లతో పాటు ఒక్కో జట్టు 9 మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత సెమీస్, ఫైనల్‌ రూపంలో మరో రెండు మ్యాచులు.. అంటే మొత్తంగా 11 మ్యాచులు ఉంటాయి..

Latest Videos


సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డు బ్రేక్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్లలో ముందుగా వినిపిస్తున్న పేరు శుబ్‌మన్ గిల్. సారా టెండూల్కర్‌తో ప్రేమాయాణం సాగిస్తున్నట్టుగా రూమర్స్ రావడంతో గిల్‌ని సచిన్ అల్లుడిగానే పిలుస్తుంటారు చాలామంది.. 

ఈ ఏడాది శుబ్‌మన్ గిల్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా వన్డేల్లో 6 సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్, 1230 పరుగులు చేశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.2 ప్లేస్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, అదే ఫామ్‌ని ప్రపంచ కప్‌లో కొనసాగిస్తే, 9-11 మ్యాచుల్లో 673+ పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 

రోహిత్ శర్మ 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ రికార్డుకి చేరువగా వచ్చాడు. ఈసారి సచిన్ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడని, ఓ డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు బాదేస్తాడని మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్న రోహిత్, 2019 ఫీట్‌ని రిపీట్ చేయడం చాలా కష్టం..

Babar Azam to remain No 1 ODI batter in ODI World Cup 2023

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఉన్న బ్యాటర్లలో ఒకడు. అయితే వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్‌గా ఉన్న బాబర్ ఆజమ్, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి టీమ్స్‌పై ఈజీగా సెంచరీలు చేస్తాడు.

అయితే సచిన్ టెండూల్కర్ రికార్డు కొట్టాలంటే ఇది సరిపోదు. ఆసీస్, ఇంగ్లాండ్, టీమిండియా, న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ బౌలింగ్ ఉన్న టీమ్స్‌పైన బాబర్ ఆజమ్ ప్రతాపం చూపించగలడా? లేదా? అనేది అతని సత్తాని డిసైడ్ చేయనుంది..

David Warner

ఇంగ్లాండ్ ప్లేయర్లు జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, ఆస్ట్రేలియా ప్లేయర్లు  మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ ప్లేయర్ డార్ల్ మిచెల్, సౌతాఫ్రికా ప్లేయర్లు క్వింటన్ డి కాక్, హెన్రీచ్ క్లాసిన్‌ కూడా ఈసారి 600+ కొట్టగల బ్యాటర్లుగా క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.. 

click me!