వాషింగ్టన్ సుందర్ ఉండగా అశ్విన్‌ని ఎందుకు సెలక్ట్ చేశారు! టీమిండియాపై యువరాజ్ సింగ్ ఫైర్..

First Published | Sep 30, 2023, 6:12 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వారం ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. నాలుగేళ్ల పాటు వైట్ బాల్ క్రికెట్‌కి దూరంగా ఉన్న అశ్విన్, ఈ ఏడాది ఆడింది రెండే వన్డేలు మాత్రమే..
 

Ashwin-Yuvraj Singh

అక్షర్ పటేల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్‌ని వరల్డ్ కప్‌ టీమ్‌కి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. అయితే ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు యువరాజ్ సింగ్..

Washington Sundar

‘అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోకపోతే, మనం ఆ ప్లేస్‌లో సరైన ఆల్‌రౌండర్ కోసం వెతకాలి. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగల బౌలర్ కావాలి. వాషింగ్టన్ సుందర్‌ని సెలక్ట్ చేసి ఉంటే, టీమిండియాకి మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దొరికేవాడు..



యజ్వేంద్ర చాహాల్‌‌ని సెలక్ట్ చేయలేదు. చాహాల్‌ ఉండి ఉంటే, టీమ్ సెలక్షన్ పర్ఫెక్ట్‌గా ఉండి ఉండేది. రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయడం మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది..

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఎవరు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తారు. ఇకనైనా టీమిండియా ప్రయోగాలు చేస్తూ, టీమ్‌లో మార్పులు చేస్తూ ఉండదని అనుకుంటున్నా..

ఈ ఇద్దరూ గాయం నుంచి కోలుకుని వస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసే వరకూ టీమ్‌లోని ప్లేయర్లు అందరూ ఫిట్‌నెస్‌ మెయింటైన్ చేయాలి. అప్పుడే కాంబినేషన్ వర్కవుట్ అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..
 

వరల్డ్ కప్ టీమ్ నుంచి దూరమయ్యాక అక్షర్ పటేల్ వేసిన ఇన్‌స్టా స్టోరీ సంచలనం రేపింది. ‘కామర్స్ బదులుగా సైన్స్ చదివి ఉంటే బాగుండేది. ఇంకా ఓ మంచి పీఆర్‌ని పెట్టుకుని ఉంటే బాగుండేది..’ అంటూ గుండె పగిలిన ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెట్టాడు అక్షర్ పటేల్. కొద్దిసేపటికే ఈ స్టోరీని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది..

Latest Videos

click me!