జడేజాతో ఫ్రాంక్ చేసిన ధోనీ... కోపంతో సీఎస్‌కే టీమ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న జడ్డూ...

First Published Mar 26, 2023, 4:11 PM IST

మహేంద్ర సింగ్ ధోనీతో దోస్తీ అంటే మామూలుగా ఉండదు అలాగే దుష్మణీ కూడా. క్రీజులో ఎంతో కూల్‌గా కామ్‌గా ఉండే మహేంద్రుడు, ఆఫ్ ఫీల్డ్ కూడా అలాగే ఉంటాడు. అందుకే కోహ్లీ, రైనా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు, ధోనీతో బాగా కనెక్ట్ అయ్యారు. అయితే జడ్డూ విషయంలో మాహీ చేసిన ఓ ఫ్రాంక్, అతను టీమ్ వీడిపోవాలని డిసైడ్ అయ్యేదాకా వెళ్లిందట...

ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్‌గా మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, మొదటి నాలుగు మ్యాచుల్లో పరాజయాలను ఎదుర్కొంది. సీజన్ ఆరంభానికి ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ అప్పగించడం జరిగిపోయాయి...

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో మొదటి రిటెన్షన్‌ రవీంద్ర జడేజాకి దక్కింది. రూ.16 కోట్లకు జడ్డూని రిటైన్ చేసుకున్న చెన్నై, ధోనీకి రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చింది... వేలంలో దీపక్ చాహార్‌ని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది..

Latest Videos

Jadeja-Dhoni

ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ని నేను అంటూ చాలాసార్లు సోషల్ మీడియాలో ప్రకటించిన రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2023 సీజన్‌లో 8 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 2 విజయాలు మాత్రమే అందుకున్నాడు. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

Dhoni Jadeja

ఐపీఎల్ 2023 సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 116 పరుగులు మాత్రమే చేసిన రవీంద్ర జడేజా, 5 వికెట్లు తీశాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జడ్డూ, చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను కూడా జారవిడిచాడు.. గాయం వంకతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే టీమ్ నుంచి తప్పుకున్నాడు...

టీమ్‌లో ధోనీ ఉండడంతో అన్నీ అతనే చూసుకుంటాడని భావించిన జడ్డూకి, కెప్టెన్ అయ్యాక మాహీ నుంచి ఎలాంటి సాయం దక్కలేదు. ఆరంభంలో వరుస మ్యాచుల్లో ఓడిన తర్వాత నిజంగానే జడ్డూని ఆన్ పేపర్ కెప్టెన్‌ని చేశాడు ధోనీ.. ఈ పరిణామాలతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. వాస్తవానికి జడేజా కెప్టెన్‌గా కొనసాగాలని అనుకున్నా, టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని బలవంతంగా ఆ పొజిషన్ నుంచి తప్పించిందని సమాచారం..

dhoni jaddu csk

ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలోనే రవీంద్ర జడేజా, గాయంతో తప్పుకోవడంతో అతన్ని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది సీఎస్‌కే. జడ్డూ అయితే సీఎస్‌కేకి సంబంధించిన ఫోటోలు, ట్వీట్లు, రిప్లైలు కూడా డిలీట్ చేసేశాడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో రవీంద్ర జడేజా కొత్త టీమ్ తరుపున ఆడతాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే 2023 సీజన్‌ మినీ వేలానికి ముందు జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో అంతా సద్ధుమణిగింది.. మళ్లీ జడేజా, సీఎస్‌కే టీమ్‌ తరుపున ఆడబోతున్నాడు..

అయితే ఇదంతా జరగడానికి ధోనీ చేసిన ఓ చిన్న ఫ్రాంక్ కారణమట. ఐపీఎల్ 2022 సీజన్‌లో జడ్డూని కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత మాహీ, జడేజాతో ‘జడ్డూ నిన్ను టీమ్ నుంచి తీసేయబోతున్నారు’ అంటూ ఫ్రాంక్ చేశాడట. ఇది నిజమని నమ్మిన జడ్డూ, సోషల్ మీడియాలో సీఎస్‌కే పోస్టులన్నీ డిలీట్ చేశాడట. ఆఖరికి మళ్లీ మాహీయే ముందుకొచ్చి, తన ఫ్రాంక్ గురించి జడేజాకి చెప్పాడంతో ఇద్దరి మధ్య వాతావరణం కుదుటపడిందని సమాచారం...
 
click me!