ఐపీఎల్‌ 2023కి 5 రోజుల ముందే 12 మంది ప్లేయర్లు అవుట్... అక్కడ కూడా ఆర్‌సీబీయే టాప్...

First Published Mar 26, 2023, 2:06 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 ఐపీఎల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఏకంగా డజన్ ప్లేయర్లు, గాయాలతో టీమ్‌లకి దూరమయ్యారు...

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ జస్ప్రిత్ బుమ్రా.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ రెండు ఫ్రాంఛైజీలకు కీ ప్లేయర్లు అయిన ఈ ఇద్దరి గైర్హజరీ... టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపనుంది...
 

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కూడా గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా లేని లోటు రిచర్డ్‌సన్‌తో తీరుతుందని భావించిన ముంబై ఇండియన్స్‌కి ఇది పెద్ద దెబ్బే. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కేల్ జెమ్మిసన్, గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు..

రాజస్థాన్ రాయల్స్ యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కొన్ని నెలలుగా గాయంతో బాధపడుతున్నాడు. టీమిండియాకి స్టార్ బౌలర్ అవుతాడనుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి..

Jonny Bairstow

కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైనట్టు సమాచారం. అయితే ఇప్పటిదాకా కోల్‌కత్తా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా గాయంతో బాధపడుతున్నాడు...

ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జానీ బెయిర్‌స్టో, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌ టీమ్‌పై జానీ బెయిర్‌స్టో లేని లోటు తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్‌తో పాటు వెలుగులోకి వచ్చిన యంగ్ ఫాస్ట్ బౌలర్ మోసిన్ ఖాన్...
 

మోసిన్ ఖాన్ ఖాన్‌, టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే దేశవాళీ టోర్నీల్లో గాయపడిన మొయిన్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్, మోసిన్ ఖాన్ ఖాన్ లేకుండానే బరిలో దిగబోతోంది...

అదృష్టానికి ఆమడదూరంలో ఉండే ఆర్‌సీబీ, గాయాల విషయంలోనూ ముందు వరుసలో ఉంది. ఏకంగా ముగ్గురు ఆర్‌సీబీ ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఇప్పటికే గాయంతో ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నాడు...

ఐపీఎల్ 2022లో సెంచరీ చేసిన యంగ్ బ్యాటర్ రజత్ పటిదార్, గాయంతో బాధపడుతున్నాడు. అతను సగం ఐపీఎల్ మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. అలాగే జోష్ హజల్‌వుడ్ గాయంతో ఇండియాతో సిరీస్‌లో ఆడలేదు. అతను ఐపీఎల్ ఆడతాడా? లేదా? అనేది అనుమానమే..
 

Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేశ్ కుమార్ చౌదరి కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతను కూడా సీఎస్‌కే ఆడిన మొదటి నాలుగైదు మ్యాచులు ఆడడం అనుమానమే.. మొత్తంగా ఐపీఎల్ ఆరంభానికి ముందే డజను మంది ప్లేయర్లు, గాయాలతో బాధపడుతుండడంతో మున్ముందు ఈ సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపోనవసరం లే.. 

click me!