ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టగానే నాకు సీన్ అర్థమైపోయింది... టీమ్‌లో ప్లేస్‌పై శిఖర్ ధావన్ కామెంట్...

First Published Mar 26, 2023, 1:33 PM IST

నాలుగు నెలల క్రితం టీమిండియాకి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఇప్పుడు మూడు ఫార్మాట్‌లోనూ ప్లేస్ కోల్పోయాడు. టీ20, టెస్టులు ఆడకపోయినా నాలుగేళ్లుగా వన్డేల్లో ఓపెనర్‌గా కొనసాగుతూ వచ్చిన శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ కారణంగా అందులో కూడా టీమ్‌కి దూరమయ్యాడు...

‘రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక నాకు చాలా సపోర్ట్ చేశాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా పిలిచి, నా ఆటపై ఫోకస్ పెట్టమని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో నీకు కచ్ఛితంగా చోటు ఉంటుందని భరోసా ఇచ్చారు..

Image credit: PTI

2022 ఏడాది నా కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేను. వరసగా వన్డేలు ఆడాను. అయితే కుర్రాళ్లు మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడం తప్పనిసరి. నేను రెండు మూడు సిరీస్‌లు బాగా ఆడలేకపోయా...
 

Shikhar Dhawan

అదే సమయంలో శుబ్‌మన్ గిల్ వచ్చి అంచనాలకు తగ్గట్టుగా ఆడాడు. నాకు టీమ్‌లో చోటు ఉంటుందా? అనే అయోమయంలో ఉన్న టైమ్‌లోనే ఇషాన్ కిషన్, బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ బాదేశాడు. అప్పుడే నాకు అర్థమైంది, టీమ్‌లో నాకు చోటు ఉండదని...

క్రికెట్‌లో ఇది చాలా కామన్. నాకు మాత్రమే కాలేదు.. ఇలా చాలామంది సీనియర్లు ఆటనుంచి తప్పుకున్నారు. ఏడాది మొత్తం ఆడుతున్నప్పుడు ఒకటి రెండు నెలలు ఫామ్ కోల్పోవడం కామన్... కొన్నిసార్లు మన పర్ఫామెన్స్ కంటే ఫెయిలైన ఆ రెండు నెలల కాలం ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది...

Image credit: PTI

కోచ్, కెప్టెన్, సెలక్టర్లు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని టీమ్‌ని సెలక్ట్ చేస్తారు. నేను సెలక్టర్‌గా ఉన్నా కూడా నా కంటే శుబ్‌మన్ గిల్‌ని ఆడించడానికే ప్రాధాన్యం ఇస్తా..

Shikhar Dhawan

ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నాడు, టీమ్‌తో ఉన్నాడు, పరుగులు చేస్తున్నాడు.. అన్నింటికంటే ఇంకో 10 ఏళ్లు ఆడగలడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్...

click me!