ఆ మ్యాచ్‌లో డకౌట్ కాకుంటే, ధోనీ ఈపాటికి రిటైర్ అయ్యేవాడే... సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ కామెంట్స్...

First Published Jun 23, 2023, 11:36 AM IST

2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2023 సీజన్‌లో కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కి ఐదో టైటిల్ అందించాడు. 2023 సీజన్ తర్వాత మాహీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరిగింది..

MS Dhoni

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఎటూ తేల్చని మహేంద్ర సింగ్ ధోనీ, దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నాడు. మోకాలి గాయంతో బాధపడుతూ ఐపీఎల్ 2023 సీజన్ ఆడిన ధోనీ, ఫైనల్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

MS Dhoni

మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక్క బంతిని కూడా ఫేస్ చేయకుండానే రనౌట్ అయిన ధోనీ, ఆఖరి ఐపీఎల్ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడంటూ ఫ్యాన్స్ మీమ్స్ కూడా పోస్ట్ చేశారు..

Latest Videos


MS Dhoni

‘14 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన దశలో రాయుడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ధోనీ వచ్చి మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇలా అవుట్ అయినందుకు ధోనీ, తన కర్తవ్యం నిర్వర్తించలేకపోయానని తెగ ఫీల్ అయ్యాడు..

ధోనీ క్రీజులో ఉంటే మ్యాచ్‌ని ముగించేసేవాడు. ఆయనకి ఉన్న స్కిల్స్‌కి అదేం అంత పెద్ద టార్గెట్ కూడా కాదు. అయితే మొదటి బంతికే అవుట్ కావడంతో చాలా ఫీల్ అయ్యాడు. అందుకే రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకోలేదు...

ఒకవేళ ఆ మ్యాచ్‌ని ధోనీ తన ట్రేడ్ మార్క్ హెలికాఫ్టర్ సిక్సర్‌తో ముగించి ఉంటే మాహీ నిర్ణయం వేరేగా ఉండేది. చివరి 2 బంతుల్లో 10 పరుగులు కావాల్సినప్పుడు జడేజా సిక్సర్ కొట్టాడు. అది చాలా చాలా కష్టం..

MS Dhoni

అంత ప్రెషర్‌ని తట్టుకుని సిక్సర్ కొట్టిన తర్వాత చివరి బంతికి ఫోర్ బాదలేనా? అనే ఆత్మవిశ్వాసం, నమ్మకం వచ్చేస్తాయి. ఏ బౌలర్‌కైనా మొదటి నాలుగు బంతులు బాగా వేసిన తర్వాత చివరి 2 బంతుల్లో మ్యాచ్ పోతే బాధగానే ఉంటుంది...

MS Dhoni

మోహిత్ శర్మ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. చివరి బంతి వరకూ గెలుస్తామనే నమ్మకం లేకపోయింది. అందుకే ధోనీ చాలా ఎమోషనల్ అయ్యాడు. రవీంద్ర జడేజా, సీఎస్‌కే కలలను నిజం చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్.. 

click me!