బజ్‌బాల్ మోజులో అసలు సంగతి మరిచిపోతున్నారు.. బెన్ స్టోక్స్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం ఆగ్రహం

Published : Jun 23, 2023, 09:29 AM IST

Ashes 2023: మైఖేల్ వాన్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆటతీరును ఏకిపారేయగా తాజాగా  దిగ్గజ ఆటగాడు  జెఫ్రీ బాయ్‌కాట్ కూడా బెన్ స్టోక్స్  సేన కొత్త ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

PREV
16
బజ్‌బాల్ మోజులో  అసలు సంగతి మరిచిపోతున్నారు..  బెన్ స్టోక్స్‌పై  ఇంగ్లాండ్ దిగ్గజం ఆగ్రహం

యాషెస్ సిరీస్‌లో భాగంగా  ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య    మూడు రోజుల క్రితం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ముగసిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్  విజయం ముందు బోల్తొ కొట్టడాన్ని ఆ జట్టు అభిమానులతో పాటు సీనియర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బెన్ స్టోక్స్ సేన బజ్‌బాల్ మోజులో పడి అసలు ఆటను మరిచిపోతుందని వాపోతున్నారు.  

26

ఇప్పటికే మైఖేల్ వాన్, కెవిన్ పీటర్సన్,  మైఖేల్ అథర్టన్ వంటి దిగ్గజాలు ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆటతీరును ఏకిపారేయగా తాజాగా  ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు  జెఫ్రీ బాయ్‌కాట్ కూడా బెన్ స్టోక్స్  సేన కొత్త ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాను ఓడించడమే ఇంగ్లాండ్ కు ముఖ్యమని.. బజ్‌బాల్ మోజులో పడి మ్యాచ్ లను ఎగ్జిబిషన్ లుగా మార్చే ప్రమాదముందని  ఆందోళన వ్యక్తం చేశాడు. 

36

బాయ్‌కాట్ టెలిగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో.. ‘ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు బజ్‌బాల్ ఆటతో యాషెస్‌ను ఎగ్జిబిషన్  సిరీస్ గా మార్చే ప్రమాదం ఉంది.  బజ్‌బాల్ మోజులో పడి విజయం సాధించడం కంటే  ఆట చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఇంగ్లాండ్ విజయం సాధించడం కంటే ఎంటర్‌టైన్‌మెంట్ పంచడమే ధ్యేయంగా కనిపిస్తున్నట్టుంది. కానీ ఇంగ్లాండ్ అభిమానులకు అన్నింటికంటే కావాల్సింది యాషెస్ సిరీస్ గెలవడమే.. మిగతావన్నీ దాని తర్వాతే.. 

46

బజ్‌బాల్ దృక్పథంతో వేగంగా పరుగులు చేయడం,  ఫోర్లు, సిక్సర్ల ద్వారా పరుగులు రాబట్టడం మంచిదే.   కానీ  మన అసలు లక్ష్యం యాషెస్ లో ఆసీస్ ను ఓడించడం.. దానిని మరువకూడదు. మీరు ఎంత వినోదాన్ని అందించినా సిరీస్ గెలవనప్పుడు  ప్రేక్షకులను ఎంత ఎంటర్‌టైన్ చేసినా దాని వల్ల ఉపయోగం లేదు. ఇంత చేసి ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగిస్తే మేం బాధపడతాం.. 

56

ఇంగ్లాండ్ గెలవడానికి  ఆడకపోతే ఈ యాషెస్ టెస్టులు అంత ముఖ్యమైనవి కావు. అవి కచ్చితంగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లే. ఎంటర్‌టైన్ కంటే ముఖ్యం  గెలవడం. ముందు దానిని దృష్టిలో పెట్టుకుంటే మంచిది.  క్రికెట్ అనేది చెస్ లాంటిది.  కొన్ని సార్లు మీరు దూకుడుగా ఉంటే మరికొన్నిసార్లు డిఫెండ్ చేసుకోవాలి. 

66

పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు  ఓపికగా ఉండాలి.  ప్రతీసారి అటాక్  చేయడమే మంచిది కాదు. ఇంగ్లాండ్ జట్టు మినిమం కామన్ సెన్స్ తో ఆలోచించాలి.  వాళ్లు ఆడుతున్నది ఆస్ట్రేలియాతో అన్న సంగతి మరువరాదు..’అని ఆయన కాలమ్ లో పేర్కొన్నాడు.  

click me!

Recommended Stories