ఐపీఎల్‌ తర్వాత రాజకీయాల్లోకి మహేంద్ర సింగ్ ధోనీ! పర్ఫెక్ట్ ఫ్యూచర్ లీడర్‌ అవుతాడంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్...

First Published May 31, 2023, 11:23 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ టైటిల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కే టైటిల్ గెలిచిన తర్వాత ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన చేస్తాడేమోనని చాలామంది అనుకున్నారు. అయితే ఎప్పటిలాగే తన రిటైర్మెంట్‌పై డౌట్స్‌ని అలాగే ఉంచేసి, వచ్చే ఏడాది కూడా ఆడతానేమోనని అన్నాడు ధోనీ..

Image credit: PTI

‘ఐపీఎల్ 2024 సీజన్‌కి ఇంకో ఏడాది ఉంది. వచ్చే ఏడాది ఆడతానేమో, కానీ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా ఏడు నెలల సమయం ఉంది. అప్పటికి నా శరీరం సహకరిస్తే ఇంకో సీజన్ ఆడతా...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ...

Image credit: PTI

‘చాలామందిలాగే నేను మహేంద్ర సింగ్ ధోనీ ఇంకో ఏడాది ఐపీఎల్ ఆడితే చూడాలని అనుకుంటున్నా. అయితే ఈ వయసులో ధోనీ ఇంకా ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు.. 

Latest Videos


Image credit: PTI

అతను ఐపీఎల్ తర్వాత రాజకీయాల్లోకి రావడంపైన దృష్టి పెట్టాలి. నేను, ధోనీతో కలిసి ఎన్‌సీసీ రివ్యూ ప్యానెల్‌లో పని చేశాను. క్రీడా మైదానంలో అతని చురుకుదనాన్ని, మేధస్సుని దగ్గర్నుంచి చూశాను....

Image credit: PTI

ధోనీ వినూత్న ఆలోచనలతో టీమ్‌ని ముందుకు తీసుకెళ్తాడు. అంతేకాకుండా టీమ్‌లో మిగిలిన ప్లేయర్లకు అన్ని రకాలుగా సహకరిస్తూ ఎంతో వినయంగా, అంతే దృఢంగా ఉంటాడు. నికార్సయిన లీడర్‌కి ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి...’ అంటూ ట్వీట్ చేశాడు మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర...

Dhoni Crying

ధోనీకి దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే ఎక్కడ మ్యాచులు ఆడినా స్టేడియం మొత్తం ధోనీ అభిమానులతో పసుపు వర్ణం అయిపోయింది. అలా చూసుకుంటే ధోనీ ఎక్కడి నుంచి పోటీచేసినా రికార్డు మెజారిటీతో నెగ్గడం గ్యారెంటీ...

తమిళనాడులో మాహీకి వీరాభిమానులు కాదు, భక్తులు కూడా లక్షల్లో ఉన్నారు. అక్కడైతే మాహీ పార్టీ పెట్టినా అఖండ మెజరిటీ గెలవవచ్చని అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే ధోనీ, క్రికెట్ నుంచి తప్పుకున్నాక తన ఫామ్‌ హౌజ్ చూసుకుంటూ, సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ప్రశాతం జీవనం గడపాలని అనుకుంటున్నాడు.. 

click me!