శ్రీవారి పాదాల చెంతకు ఐపీఎల్ 2023 ట్రోఫీ... చెన్నైలోని తిరుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు...

First Published May 31, 2023, 10:44 AM IST

60 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగి, ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2023 సీజన్‌ ఘనంగా ముగిసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా మూడు రోజుల పాటు సాగింది...

మే 28న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వు డే మే 29న ప్రారంభమైంది. మే 29న కూడా మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కురవడంతో రెండు గంటల పాటు ఆట నిలిచిపోయింది..

Image credit: PTI

ఎట్టకేలకు మే 29 అర్ధరాత్రి ముగిసిన తర్వాత భారత కాలమానం ప్రకారం మే 30న ఒంటిగంటన్నరకు ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి దాకా సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ని 5 వికెట్ల తేడాతో ఓడించింది..

Latest Videos


Image credit: PTI

గత సీజన్‌లో 14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకుని 9వ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2023 సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇస్తూ ఐదో టైటిల్ కైవసం చేసుకుంది. 

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, 2023 ఐపీఎల్ ట్రోఫీకి చెన్నైలోని తిరుపతి దేవస్థానం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో సీఎస్‌కే యజమాని ఎన్ శ్రీనివాసన్ కూడా పాల్గొన్నాడు.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి... 

ట్రోఫీని చెన్నై టీటీడీ ఆలయానికి తీసుకొచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్, శ్రీవారి పాదాల చెంతన దానికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఐపీఎల్ 2021 విజయం తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో భారీ సెలబ్రేషన్స్ నిర్వహించింది సీఎస్‌కే...
 

ఐపీఎల్ 2023 సీజన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయబోతున్నారని సమాచారం. సీఎస్‌కే టీమ్‌లో కీ ప్లేయర్లుగా ఉన్న రవీంద్ర జడేజా, అజింకా రహానే ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కి వెళ్లారు...

అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో 590 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, జూన్ 2-3 తేదీల్లో వివాహం చేసుకోబోతున్నాడు. దీంతో వచ్చే నెల ప్రథమార్ధంలో చెన్నై సూపర్ కింగ్స్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఉండవచ్చని సమాచారం.. 

click me!