కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ రికార్డునే దాటేసిన హార్ధిక్ పాండ్యా... సచిన్, రోహిత్ శర్మ కూడా వెనకాలే...

First Published May 31, 2023, 11:03 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్, ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే హార్ధిక్ పాండ్యా ఖాతాలో మాత్రం అరుదైన రికార్డు చేరింది..

Dhoni-Hardik Pandya

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, 2 సీజన్లలో కలిపి 31 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. వీటిల్లో 22 మ్యాచుల్లో విజయాలు అందుకున్న హార్ధిక్ పాండ్యా, 70.96 విజయాల శాతంతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు...

PTI PhotoKunal Patil)(PTI05_29_2023_000249B)

కనీసం 30 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన వారిలో అత్యధిక విజయాలు శాతం నమోదు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యానే. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 226 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 133 మ్యాచుల్లో గెలిచాడు. 91 మ్యాచుల్లో ధోనీ టీమ్ ఓడింది. మాహీ విన్నింగ్ పర్సంటేజ్ 58.84 మాత్రమే...

Latest Videos


ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 51 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 30 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు. సచిన్ విన్నింగ్ పర్సంటేజ్ 58.82... మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ల లిస్టులో టాప్ 3లో ఉన్నాడు టెండూల్కర్...

పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి టీమ్స్‌కి కెప్టెన్సీ చేసిన స్టీవ్ స్మిత్, ఐపీఎల్‌లో 43 మ్యాచులకు సారథిగా వ్యవహరించి 25 విజయాలు అందుకున్నాడు. టాప్ 3లో స్మిత్ విన్నింగ్ పర్సంటేజ్ 58.13..

ముంబై ఇండియన్స్‌కి 8 సీజన్లలో 5 టైటిల్స్ అందించిన రోహత్ శర్మ, తన కెరీర్‌లో 158 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 87 విజయాలు అందుకున్నాడు. రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజ్ 55.06గా ఉంది..
 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి 2 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన గౌతమ్ గంభీర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 129 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 71 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు. టాప్ 5లో ఉన్న గంభీర్ విన్నింగ్ పర్సంటేజ్ 55.03గా ఉంది.. 

click me!