ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. రుతురాజ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చెన్నై టీమ్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. సీఎస్కే కంటే దిగువ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్కటే ఉంది.
శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ధోని కెప్టెన్సీలో బరిలోకి దిగింది. కానీ, జట్టు ఆటతీరులో మార్పు రాలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా వికెట్ సమర్పించుకుని పెవిలియన్ కు చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.