ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో సూర్యకుమార్ యాదవ్... ఎమర్జింగ్ ప్లేయర్ లిస్టులో అర్ష్‌దీప్ సింగ్..

Published : Dec 29, 2022, 06:05 PM IST

2022 ఏడాది సూర్యకుమార్ యాదవ్‌కి బాగా కలిసొచ్చింది. టీ20ల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌ని అందుకున్న సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది రెండు టీ20 సెంచరీలు కూడా బాదాడు. తాజాగా ఐసీసీ అవార్డుల షార్ట్ లిస్టులోనూ సూర్యకు చోటు దక్కింది..

PREV
17
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో సూర్యకుమార్ యాదవ్... ఎమర్జింగ్ ప్లేయర్ లిస్టులో అర్ష్‌దీప్ సింగ్..
Image credit: PTI

వచ్చే నెలలో జరిగే శ్రీలంకతో టీ20 సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు సూర్యకుమార్ యాదవ్... తాజాగా ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (మెన్స్) రేసులో నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది మొత్తంగా 31 మ్యాచుల్లో 1164 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్...

27
suryakumar

మహ్మద్ రిజ్వాన్ తర్వాత ఒకే ఏడాదిలో 1000కి పైగా టీ20 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్, 187.43 స్ట్రైయిక్ రేటుతో నిలిచాడు. ఈ ఏడాది 68 సిక్సర్లు బాదిన సూర్య, 9 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు...

37

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ నిలిచారు... రిజ్వాన్ ఈ ఏడాది 996 పరుగులు చేయగా సామ్ కుర్రాన్ 25 వికెట్లు తీశాడు. సికిందర్ రజా 735 పరుగులు చేసి, 25 వికెట్లు తీసి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు...

47

భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఐసీసీ వుమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నిలిచింది. స్మృతి మంధానతో పాటు పాక్ క్రికెటర్ నిదా దర్, న్యూజిలాండ్ క్రికెటర్ సోఫియా డివైన్, ఆస్ట్రేలియా ప్లేయర్ తహిళా మెక్‌గ్రాత్... వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో ఉన్నారు...

57
Image credit: Getty

భారత యంగ్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్, ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచాడు. ఈ ఏడాది 33 టీ20 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో టీమిండియా తరుపున మంచి బౌలింగ్ పర్పామెన్స్‌తో ఆకట్టుకున్నాడు...

67
Arshdeep Singh

అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సౌతాఫ్రికా యంగ్ బౌలర్ మార్కో జాన్సెన్, ఆఫ్ఘాన్ యంగ్ ప్లేయర్ అబ్రహిం జోర్డాన్, న్యూజిలాండ్ హిట్టర్ ఫిన్ ఆలెన్... ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచారు. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌లో బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా, వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ నిలిచారు.. 

77
Renuka Singh

వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌లో బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా, వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ నిలిచారు..  ఐసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రేసులో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్, వికెట్ కీపర్ యషికా భాటియా నిలిచారు. వీరితో పాటు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ ప్లేయర్ అలీస్ కాప్సీ పోటీలో ఉన్నారు. 

click me!

Recommended Stories