ఆ విషయంలోనూ దీపక్ చాహార్‌కి మహీ సలహా... గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజల్ వెనకాల...

First Published Oct 8, 2021, 4:18 PM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఒక్కసారి ఆడితే చాలు... ఆ ప్లేయర్ ఎక్కడ, ఏం చేసినా దాని వెనకాల మహేంద్ర సింగ్ ధోనీ స్ఫూర్తి, గైడెన్స్ ఉండి తీరాతాయని అంటారు మాహీ వీరాభిమానులు... అలా ప్లేయర్లు చెప్పకపోయినా ఫ్యాన్స్ ఊరుకోరు...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చిత్తుగా ఓడింది. కెఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో కారణంగా 13 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది పంజాబ్...

అయితే మ్యాచ్ అనంతరం దీపక్ చాహార్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ చేయడంతో మ్యాచ్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు జనాలు... ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైకే వెళ్లింది...

దీపక్ చాహార్ లవ్ ప్రపోజల్ విషయంలో సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ జోక్యం ఉందట.... అదేలాగంటే ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్...

దీంతో ప్లేఆఫ్స్‌లో మ్యాచ్ అనంతరం, లేదా ఫైనల్‌లో టైటిల్ గెలిచిన అనంతరం తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయాలని అనుకున్నాడట దీపక్ చాహార్...

ఈ విషయాన్ని మాహీతో పంచుకున్నాడట. అయితే ధోనీ మాత్రం ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత ప్రపోజ్ చేయాల్సిందిగా దీపక్ చాహార్‌కి సలహా ఇచ్చాడట..

ప్లేఆఫ్స్‌లో క్వాలిఫైయర్ 1 లేదా ఫైనల్‌లో ఓడితే అప్పుడు అభిమానులందరి మూడ్ వేరేగా ఉంటుంది. సీఎస్‌కే తీవ్ర అసంతృప్తితో ఉంటారు...

టైటిల్ గెలవలేకపోయామని ఆటగాళ్లు కూడా నిరుత్సాహానికి గురి అవుతారు.. అలాంటి సమయంలో లవ్ ప్రపోజ్ లాంటి పనులు చేస్తే, అస్సలు బాగోదని సూచించాడట...

ఈ విషయాన్ని దీపక్ చాహార్ తండ్రి మీడియాకి తెలియచేశాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మాహీ యాంటీ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో  దీపక్ చాహార్ ఆడిన ఇన్నింగ్స్ క్రెడిట్ కూడా మహీ ఖాతాలోనే చేరింది. ఆ రోజు మ్యాచ్ అనంతరం దీపక్ చాహార్, మాహీ గురించి చెప్పకపోయినా... రిపోర్టర్ కావాలని ధోనీ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు...

ధోనీ ప్రస్తావన రావడంతో ఇంక కాదనలేక దీపక్ చాహార్ కూడా మాహీ భాయ్ కెప్టెన్సీలో ఆడడం వల్లే ఒత్తిడిని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నానంటూ కామెంట్ చేశాడు...

ఇప్పుడు కూడా దీపక్ చాహార్ పర్సనల్ లైఫ్ విషయంలోనూ మహేంద్ర సింగ్ ధోనీ జోక్యం ఉందని చెప్పడం చూస్తుంటే... సీఎస్‌కే ప్లేయర్లు ఏం చేసినా దానికి మాహీ మహిమే కారణమని అంటున్నట్టు ఉందని వాదిస్తున్నారు...

click me!