IPL2021 RR vs KKR: కేకేఆర్ చేతుల్లో రాజస్థాన్ రాయల్స్ చిత్తు... ప్లేఆఫ్స్‌కి కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

Published : Oct 07, 2021, 10:59 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగో ఫ్లేఆఫ్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది. సెకండాఫ్‌లో అద్భుత విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 86 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు...

PREV
110
IPL2021 RR vs KKR: కేకేఆర్ చేతుల్లో రాజస్థాన్ రాయల్స్ చిత్తు... ప్లేఆఫ్స్‌కి కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

172 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్, ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు. మొదటి ఓవర్‌లో మొదలైన రాయల్స్ వికెట్ల పతనానికి ఏ దశలోనూ బ్రేక్ పడలేదు... 16.1 ఓవర్లలో 85 పరుగులకి ఆలౌట్ అయ్యింది రాజస్థాన్ రాయల్స్...

210

యశస్వి జైస్వాల్‌ను మొదటి ఓవర్‌ వేసిన షకీబుల్ హాసన్ బౌల్డ్ చేయగా, ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే సంజూ శాంసన్‌ను అవుట్ చేశాడు శివమ్ మావి. లియామ్ లివింగ్‌స్టోన్ 6 పరుగులు చేయగా, అనుజ్ రావత్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

310

8 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్, 20 బంతుల్లో 18 పరుగులు చేసిన శివమ్ దూబేలను శివమ్ మావి క్లీన్‌బౌల్డ్ చేశాడు... ఆ తర్వాత క్రిస్ మోరిస్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

410

35 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్ తెవాటియా, శివమ్ మావి వేసిన 10వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు...

510

జయ్‌దేవ్ ఉనద్కడ్ 6 పరుగులు చేసి ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ కాగా రాహుల్ తెవాటియా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. చేతన్ సకారియా 5 బంతుల్లో ఒక్క పరుగు చేసి రనౌట్ అయ్యాడు... 

610

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్ల ధాటికి ఒకానొక దశలో ఆర్‌సీబీ 49 పరుగుల రికార్డును కూడా రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ చేస్తుందని అనిపించింది. అయితే 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా... ఆర్ఆర్ పరువును కాపాడాడు. 

710

పాజిటివ్ నెట్ రన్‌రేట్‌(+0.294)‌తో ఈ మ్యాచ్‌ను ప్రారంభించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ను దారుణంగా ఓడించి... దాన్ని సూపర్ పాజిటివ్‌గా మెరుగుపర్చుకుంది... 

810

ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు, సన్‌రైజర్స్‌పై విజయం సాధించినా వారి రన్‌రేట్ (-0.048) నెగిటివ్‌లో ఉన్నందున దాన్ని పాజిటివ్‌గా మలుచుకుని, కేకేఆర్‌ను అధిగమించి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించడం అసాధ్యమే...

910

ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడిస్తే ఐదో స్థానంతో సీజన్‌ను ముగిస్తుంది.. తొలుత బ్యాటింగ్ చేసి 200+ పరుగులు చేసి, సన్‌రైజర్స్‌ను 170+తేడాతో ఓడిస్తేనే ప్లేఆఫ్స్ చేరుతుంది ముంబై ఇండియన్స్...

1010

గత సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో లీగ్‌ను ముగించిన రాజస్థాన్ రాయల్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఈ సీజన్‌‌ను ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని ఏడో స్థానంతో ముగించింది... 

click me!

Recommended Stories