IPL 2021: ఈ సీజన్ లో తేలిపోయిన ఐదుగురు కెప్టెన్లు వీళ్లే.. వచ్చే ఐపీఎల్ లో వీరికి ఉధ్వాసన తప్పదా..?

First Published | Oct 8, 2021, 3:43 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరింది. శుక్రవారం జరిగే రెండు మ్యాచులతో ఇక వాటికి తెరపడుతుంది. ఈ నెల 10 నుంచి నాకౌట్ దశ మొదలుకానున్నది. అయితే జట్టును ముందుండి నడిపించడంలో ఈ ఐదుగురు కెప్టెన్లు దారుణంగా విఫలమయ్యారు. వాళ్లెవరో ఇక్కడ చూద్దాం. 

MS DHONI: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని త్వరలో ఐపీఎల్ కెరీర్ కు కూడా గుడ్ బై చెప్పబోతున్న  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సారథి మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న ధోని... ఇప్పటివరకు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ గా ధోని సక్సెస్ అవుతున్నా.. ఆటగాడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ లో ధోని అత్యధిక స్కోరు 18 పరుగులు. IPL 2021 సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ధోని.. 96 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

EION MORGON: కోల్కతా  నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఈ ఐపీఎల్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ చేయలేదు. పడుతూ లేస్తూ జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చిన మోర్గాన్.. ప్లేయర్ గా మాత్రం తేలిపోయాడు. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ తో మొత్తం 14 మ్యాచ్  లు ఆడిన మోర్గాన్ 124 పరుగులు మాత్రమే చేశాడు. 

Latest Videos


KANE WILLIAMSON: ఈ సీజన్ లో అత్యంత చెత్తగా ఆడిన జట్టు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా సన్ రైజర్స్ హైదరబాద్ (SRH). ఆరెంజ్ ఆర్మీకి ఈసారి ఏదీ కలిసిరాలేదు. ఆ జట్టులోకి ఆటగాళ్లెవరూ ఫామ్ లో లేరు. ఇక సెకండ్ ఫేజ్ లో కెప్టెన్ గా వచ్చిన కేన్ మామ కూడా అదిరిపోయే ఆకట్టుకునే ఆట మాత్రం ఆడలేదు. 10 మ్యాచ్ లు ఆడిన విలియమ్సన్.. 266 పరుగులు చేశాడు. 

DAVID WARNER: సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ తొలి సీజన్ లో హైదరాబాద్ జట్టకు కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ఈసారి పేలవ ఫామ్ కారణంగా అతడు భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయాడు. ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన 195 పరుగులు మాత్రమే చేశాడు.

ROHIT SHARMA: ఐదుసార్లు ఐపీఎల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే ధనాధన్ ఆటలో మంచి రికార్డున్న ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సారి విఫలమయ్యాడు. ఒకటి, రెండు మ్యాచ్ లు తప్ప మిగతా వాటిల్లో పెద్దగా రాణించలేదు.  ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 303 పరుగులు చేశాడు. 

ఇదిలాఉంటే మరోవైపు యువ కెప్టెన్లు సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశారు. భవిష్యత్తు భారత జట్టుకు ఆశాకిరణాలుగా గుర్తింపు పొందిన ఈ ఆటగాళ్లలో పంత్ ఒక్కడే ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ఉన్నాడు. కాగా, విఫలమైన కెప్టెన్లలో ఇద్దరు, ముగ్గరు వచ్చే ఐపీఎల్  సీజన్ లో కనిపించకపోవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. ఫామ్, వయస్సు సమస్యల రీత్యా వీరిని పక్కనబెట్టే అవకాశమున్నట్టు ఫ్రాంచైజీ ప్రతినిధులు హింట్లు ఇచ్చేశారు.

click me!