రోహిత్ సమస్య ఫామ్ ఒక్కటే కాదు... టీమిండియా కెప్టెన్‌పై దిలీప్ వెంగ్‌సర్కార్ కామెంట్స్...

Published : Jun 05, 2023, 12:02 PM IST

ఐపీఎల్ సక్సెస్‌తో టీమిండియా కెప్టెన్సీ చేపట్టాడు రోహిత్ శర్మ. అయితే భారత జట్టుకి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక రోహిత్ శర్మ ఫామ్ ఏ మాత్రం సరిగ్గా లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో, 2023 సీజన్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు రోహిత్ శర్మ...

PREV
17
రోహిత్ సమస్య ఫామ్ ఒక్కటే కాదు... టీమిండియా కెప్టెన్‌పై దిలీప్ వెంగ్‌సర్కార్ కామెంట్స్...

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో కూడా రోహిత్ శర్మ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 332 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎలా రాణిస్తాడనేది టీమిండియాని కలవరబెడుతున్న విషయం...

27

‘రోహిత్ శర్మ సమస్య ఫామ్ ఒక్కటే కాదు. నా ఉద్దేశంలో అతను తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. టీమిండియాకి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండడం వల్ల అతను మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒత్తిడికి లోనవుతున్నట్టు ఉంది...

37
Image credit: PTI

అంతేకాకుండా టీమిండియా నేరుగా ఐపీఎల్ నుంచి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇది కూడా పెద్ద సమస్యే. టీ20 మూడ్ నుంచి టెస్టు మూడ్‌కి స్విచ్ కావాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. ఇది టీమిండియాకి చాలా పెద్ద టెస్టు...

47
Image credit: PTI

ఒకే ఒక్క ఫైనల్, రెండో ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి టెస్టు సిరీస్‌కి ప్రిపేర్ అయినట్టు కాకుండా ప్రతీ ఇన్నింగ్స్, ప్రతీ సెషన్ ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి, టీమిండియా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే రిజల్ట్ మరోసారి తేడా కొట్టేస్తది..

57
Image credit: PTI

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెఎస్ భరత్ స్పెషలిస్ట్ వికెట్ కీప్‌గా ఉన్నాడు. అతన్ని కొనసాగించడమే బెటర్. ఇప్పటిదాకా టెస్టులు ఆడని ఇషాన్ కిషన్‌ని ఆరంగ్రేటం చేయించడం రిస్కే అవుతుంది. ఇండియా, ఆస్ట్రేలియాల్లో ఉండే పరిస్థితులతో పోలిస్తే ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్ వేరేగా ఉంటుంది..

67
Image credit: PTI

అక్కడ బాల్ స్వింగ్‌ని అర్థం చేసుకోవడం చాలా పెద్ద సమస్య. ఎక్స్‌ట్రా బౌన్స్ ఉంటుంది, అది భారత బ్యాటర్లను మరింత ఇబ్బంది పెట్టొచ్చు. భారత జట్టు వారం, పది రోజుల ముందే అక్కడికి వెళ్లారు. ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లు టీమ్‌లో ఉన్నారు...
 

77
Image credit: PTI

గత ఏడాది ఇంగ్లాండ్‌లో కూడా పర్యటించారు. భారత జట్టులాగే ఆస్ట్రేలియాకి కూడా ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్‌కి అలవాటు పడడం కాస్త సమస్యే. అయితే ఇండియా కంటే వాళ్లకి అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. 

Read more Photos on
click me!

Recommended Stories