ఆ ఓటమి తర్వాత 3 రోజులు గదిలోంచి బయటికి రాలేదు! ఉన్నామా చచ్చామా అని కూడా... - వీరేంద్ర సెహ్వాగ్...

First Published Jun 4, 2023, 7:09 PM IST

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్ కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన భారత జట్టు, సంచలన విజయాలతో ఫైనల్ చేరింది. ఫైనల్ ఓడినా టీమిండియా ఆ టోర్నీలో ఆడిన విధానంతో 2007 వన్డే వరల్డ్ కప్‌లో హాట్ ఫెవరెట్‌గా మారింది. అయితే రిజల్ట్ మాత్రం ఘోర పరాభవం...
 

మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి కుర్రాళ్ల రాకతో టీమ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో గ్రెగ్ ఛాపెల్ కోచింగ్‌లో వరుస విజయాలు అందుకున్న భారత జట్టు, ఈసారి వరల్డ్ కప్ గెలవడం ఖాయమనుకున్నారంతా...

అయితే గ్రూప్ స్టేజీలో పసికూన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఊహించని పరాభవం అందుకుంది టీమిండియా. ఆ తర్వాత బర్ముడాతో మ్యాచ్‌లో భారీ విజయం అందుకుంది. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది. ఈ పరాజయంతో టీమిండియా క్రికెటర్ల ఇళ్లపై ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. క్రికెటర్ల ఫోటోలు, దిష్టి బొమ్మలను దహనం చేశారు...

‘2007 వన్డే వరల్డ్ కప్ పరాభవం ఇప్పటికీ చాలా బాధపెడుతుంది. ఎందుకంటే అప్పుడున్న టీమ్, వరల్డ్ బెస్ట్ టీమ్... ఆన్ పేపర్ ఇప్పటికీ అంతకంటే బెస్ట్ టీమ్ కనిపించదు.  2003లో మేం వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం, ఆ తర్వాత 2011లో టైటిల్ కూడా గెలిచాం. కానీ 2007లో ఆడిన టీమ్‌ అంత స్ట్రాంగ్ టీమ్ అయితే ఎప్పుడూ లేదు...

Virender Sehwag

గ్రూప్ మ్యాచుల్లో మూడింట్లో రెండు ఓడిపోయాం. గెలిచిన ఒక్కటీ కూడా బెర్ముడాపై వచ్చింది...  అందరూ ఇండియా కచ్చితంగా ప్లేఆఫ్స్‌కి వెళ్తుందని అనుకున్నారు. అందుకే తర్వాతి రౌండ్ కోసం ట్రిడినాడ్ అండ్ టొబాగో వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ అయ్యాయి..

కానీ మేం గ్రూప్ స్టేజీలోనే ఓడిపోవడంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి... మ్యాచులు లేవు, ప్రాక్టీస్ లేదు, పని లేదు... ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. మేమున్న రూమ్‌కి రూమ్ సర్వీస్ వాళ్లు కూడా వచ్చేవాళ్లు కాదు. ఫోన్ చేసి హౌజ్ కీపింగ్‌కి పిలవలన్నా ఏదోలా ఉండేది.. 
 

ఏం చేయాలో తెలియక మూడు రోజుల పాటు హోటల్ గది నుంచి బయటికి రాలేదు. అమెరికాలో నాకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. వాడిని అడిగి ‘Prison Break’  సిరీస్ తీసుకున్నా. రెండు రోజుల పాటు ఆ షో చూస్తూ కూర్చున్నా. ఆ రెండు రోజులు ఎవ్వరి ముఖం చూడలేదు. మేం బతికామా, చచ్చామా అని పట్టించుకున్నవాళ్లు కూడా లేరు...
 

ఆ అనుభవంతోనే 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం. మేం ఎక్కడికి వెళ్లినా హోటల్ వెయిటర్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ టైటిల్ గెలవాలని చెబుతూ వచ్చారు. అంచనాలు పెరిగిపోయాయి, దాంతో పాటు మాపై ఒత్తిడి కూడా...

Gary Kirsten

అయితే గ్యారీ కిర్‌స్టన్‌ చాలా చక్కగా మమ్మల్ని మోటివేట్ చేశాడు. ప్రతీ మ్యాచ్ ఫైనల్‌లా ఆడాలని చెప్పాడు. అందుకే ఫైనల్‌లో కూడా మాపై ప్రత్యేకంగా ఒత్తిడి పడలేదు. ఎందుకంటే మొదటి మ్యాచ్‌ని కూడా మేం ఫైనల్‌లాగే ఫీల్ అయ్యాం. అలా అయ్యేలా చేశాడు గ్యారీ...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

click me!