మహ్మద్ షమీని స్టాండ్‌బై ప్లేయర్‌గా పెట్టడం అవమానించడమే... అతని కంటే వాళ్లు ఎందులో బెస్ట్...

Published : Sep 13, 2022, 03:46 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు మహ్మద్ షమీ. టీ20 వరల్డ్ కప్ 2022 ప్రిపరేషన్స్ కోసం తనదైన ప్లాన్స్ వేసుకున్న బీసీసీఐ, శిఖర్ ధావర్‌, మహ్మద్ షమీ వంటి ప్లేయర్లను పూర్తిగా పొట్టి ఫార్మాట్‌కి దూరం పెట్టింది. అయితే ఆసియా కప్ 2022 రిజల్ట్ తర్వాత హడావుడిగా షమీని మళ్లీ టీ20ల్లోకి తీసుకొచ్చింది బీసీసీఐ...

PREV
17
మహ్మద్ షమీని స్టాండ్‌బై ప్లేయర్‌గా పెట్టడం అవమానించడమే... అతని కంటే వాళ్లు ఎందులో బెస్ట్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కింది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క టీ20 కూడా ఆడని షమీ, ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ద్వారా మళ్లీ పొట్టి ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

27
Image credit: Getty

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో మహ్మద్ షమీకి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు అభిమానులు. ఎంతో అనుభవం ఉన్న షమీని స్టాండ్ బై ప్లేయర్‌గా కూర్చోబెట్టడం అంటే... అతన్ని అవమానించడమే అంటున్నారు..

37
Bumrah and Shami

ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్‌లను తప్పించిన బీసీసీఐ సెలక్టర్లు... వారి స్థానంలో జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లకు అవకాశం కల్పించారు. యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌ని స్టాండ్‌బైలోకి మార్చి, అక్షర్ పటేల్‌కి 15 మంది జాబితాలో చోటు కల్పించారు...

47

‘నేను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌‌ని అయి ఉంటే మహ్మద్ షమీకి కచ్ఛితంగా 15 మంది జట్టులో చోటు కల్పించేవాడిని. ఎందుకంటే ఈసారి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాం. అక్కడ పిచ్‌లను అర్థం చేసుకోవడానికి అనుభవం కావాలి...

57
Mohammed Shami

బౌన్సీ పిచ్‌లపై ఎలాంటి బంతులు వేయాలనే విషయం కొత్త కుర్రాళ్లకు అర్థం కాదు. జస్ప్రిత్ బుమ్రా అయితే ఆసీస్ పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు కాబట్టి ఆరంభంలోనే వికెట్లు తీయగలుగుతాడు... నా ఉద్దేశంలో హర్షల్ పటేల్ కంటే మహ్మద్ షమీ తుది జట్టులో ఉండడం సబబుగా ఉంటుంది..

67
Harshal Patel

హర్షల్ పటేల్ మంచి బౌలర్. అతనికి చాలా అనుభవం ఉంది. అయితే అంతర్జాతీయ అనుభవం విషయానికి వస్తే మహ్మద్ షమీ సరైన ఛాయిస్ అవుతాడు. ఇన్ని రోజులు అతన్ని టీ20లకు దూరం పెట్టామనే కారణంగా షమీని స్టాండ్ బై ప్లేయర్‌గా పెట్టారు...

77

ఐపీఎల్‌లో మహ్మద్ షమీ చక్కగా రాణించాడు. ఆ తర్వాతైనా అతన్ని టీ20ల్లో కొనసాగించాల్సింది. షమీ అందుబాటులో ఉండి ఉంటే ఆసియా కప్ రిజల్ట్ కూడా బెటర్‌గా ఉండి ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్... 

click me!

Recommended Stories