టీ20 వరల్డ్ కప్‌లో కొత్త జెర్సీలో భారత జట్టు... ఆ జెర్సీ కావాలని ఫ్యాన్స్ డిమాండ్...

First Published Sep 13, 2022, 2:17 PM IST

క్రికెట్‌లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఆడే రోజును బట్టి, ప్లేస్‌ని బట్టి మాత్రమే కాకుండా వేసుకునే జెర్సీ రంగును బట్టి మ్యాచ్ ఫలితం మారిపోతుందని నమ్ముతారు క్రికెట్ ఫ్యాన్స్. 2011 వన్డే వరల్డ్ కప్‌లో విజయాన్ని ఇచ్చిన జెర్సీని మార్చి, కొత్త జెర్సీ వాడడం వల్లే 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓడిందనేది చాలా మంది అభిప్రాయం...

rohit sharma

2021 టీ20 వరల్డ్ కప్‌కి ముందు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. కీలక టోర్నీకి ముందు టీమిండియా జెర్సీ మారింది. బ్లూ కలర్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ ఛీర్స్ నుంచి తీసిన ‘సౌండ్ వేవ్స్’ డిజైన్‌తో తీసిన కొత్త జెర్సీతో 2021 పొట్టి ప్రపంచకప్ ఆడింది టీమిండియా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్... ఇలా బిజీ బిజీ షెడ్యూల్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడింది టీమిండియా. వార్మప్ మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు, తీరా టోర్నీ మొదలయ్యాక అసలు మ్యాచుల్లో తేలిపోయింది...

ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటి సారి పాక్ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది... ఈ పరాజయాలతో టీమిండియాకి ఈ సౌండ్ వేవ్ జెర్సీ కలిసి రాలేదని తీవ్రంగా ట్రోల్ చేశారు అభిమానులు..

Rohit Sharma and KL Rahul

ఈ దెబ్బతో టీమిండియా జెర్సీని మరోసారి మార్చేసింది బీసీసీఐ. సౌండ్ వేవ్స్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన భారత జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలోనూ ఇదే జెర్సీతో బరిలో దిగింది... ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ 2022లో మళ్లీ కొత్త జెర్సీలో కనిపించనుంది భారత జట్టు...

ఈ మధ్య కాలంలో జెర్సీ మార్చిన ప్రతీసారీ టీమిండియాకి పరాజయమూ, పరాభవమే ఎదురయ్యాయి. దీంతో హాట్ ఫెవరెట్‌ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగుతున్న భారత జట్టు, మరోసారి అభిమానులను నిరాశపరుస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

టీ20 వరల్డ్ కప్ 2007 తర్వాత రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ కలిసి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడబోతున్నారు. కాబట్టి అప్పుడు వాడిన జెర్సీని మళ్లీ తీసుకొస్తే, అదే రిజల్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు మరికొందరు అభిమానులు... 

click me!