71వ సెంచరీ ఇచ్చిన జోష్, అక్కడ రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... ఇన్‌స్టా, ట్విట్టర్‌లో...

First Published Sep 13, 2022, 2:47 PM IST

లేక లేక మూడేళ్ల తర్వాత 71వ సెంచరీని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టు సూపర్ 4 స్టేజీకే పరిమితమైందని బాధపడుతున్న టీమిండియా ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ సెంచరీతో కాస్త ఊరట లభించింది. ఇదే జోష్‌లో సోషల్ మీడియాలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ...

Image Credit: Anushka Sharma Instagram

విరాట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుగులేని రికార్డు ఉంది. ఇండియాలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ... ఇన్‌స్టాలో 211 మిలియన్లకు ఫాలోవర్లు విరాట్‌ని ఫాలో అవుతున్నారు...

సాకర్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 200+ మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగిన మూడో అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు ట్విట్టర్‌లోనూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు...

ట్విట్టర్‌లో 50 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ట్విట్టర్‌లో 16.4 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి 18.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

భారత ప్రస్తుత సారథి రోహిత్ శర్మకు ట్విట్టర్‌లో 20.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా మహేంద్ర సింగ్ ధోనీ ట్వి్ట్టర్ ఫాలోవర్ల సంఖ్య 8.4 మిలియన్లు మాత్రమే. వీరందరికీ చాలా ముందున్న విరాట్ కోహ్లీ... ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్‌లో కలిపి 310 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు...

ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో చెలరేగి అంతర్జాతీయ కెరీర్‌లో మొట్టమొదటి టీ20 సెంచరీని అందుకున్న విరాట్ కోహ్లీ, 71 శతకాలతో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. దీంతో మరోసారి కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు గురించి డిస్కర్షన్ మొదలైపోయింది...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వకపోవడం కొసమెరుపు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ధోనీ వంటి క్రికెటర్లను ఫాలో అవుతున్న విరాట్... రోహిత్ భార్య రితికాను కూడా ఫాలో అవుతున్నారు. రోహిత భార్య రితికా, విరాట్‌కి మాజీ మేనేజర్‌ అనే విషయం తెలిసిందే...

click me!