ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సహా ఆసియా కప్ 2025 లో 5 ఆసక్తికర అంశాలు

Published : Sep 03, 2025, 02:53 PM IST

Asia Cup 2025 Five Key Highlights: సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 లో 8 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ పోటీ నుండి అసోసియేట్ దేశాల ఎదుగుదల వరకు, ఈ టోర్నమెంట్ లోని టాప్ 5 ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
ఆసియా కప్ 2025 ఎప్పుడు, ఎక్కడ?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. ఇది 17వ ఆసియా కప్ ఎడిషన్. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. ఈసారి ఆసియా కప్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో యూఏఈ, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, ఒమన్, హాంకాంగ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

DID YOU KNOW ?
ఆసియా కప్ ఫార్మాట్
ఐసీసీ వరల్డ్ కప్ ఏ ఫార్మాట్‌లో (ODI లేదా T20) జరుగుతుందో, దానికి ముందు ఏడాది జరిగే ఆసియా కప్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఉదాహరణకు, 2026లో T20 వరల్డ్ కప్ ఉండటంతో 2025 ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
26
ఇండియా-పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లు చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. అప్పుడు ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మ్యాచ్ జరగాలా లేదా అన్న చర్చలు ఎక్కువయ్యాయి. కానీ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ప్రకారం, రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోయినా, అంతర్జాతీయ టోర్నమెంట్లలో మాత్రం తలపడతాయని తెలిపింది.

ఆసియా కప్ చరిత్రలో ఇంతవరకు 19 సార్లు భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అందులో ఇండియా 10 విజయాలు, పాకిస్తాన్ 6 విజయాలు సాధించగా, మూడు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.

36
డార్క్ హార్స్‌గా అఫ్ఘానిస్తాన్

ఆసియా కప్ 2025 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ జట్లు ప్రధాన టైటిల్ ఫేవరెట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, అఫ్ఘానిస్తాన్ గత కొన్ని సంవత్సరాల్లో ఆసియా క్రికెట్‌లో బలమైన జట్టుగా ఎదిగింది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కి చేరింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంకలపై అద్భుత విజయాలు సాధించింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ను ఓడించడంతో అఫ్ఘానిస్తాన్ తన ప్రత్యేకతను నిరూపించుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్, యూఏఈ ట్రై సిరీస్ ఆడుతోంది. ఆసియా కప్‌లో అఫ్ఘానిస్తాన్ గ్రూప్ బీలో ఉంది. అప్ఘాన్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్‌ జట్లు కూడా గ్రూప్ బీ లో ఉన్నాయి

46
ఆసియా కప్ లో అసోసియేట్ జట్ల ఎదుగుదల

రాబోయే ఆసియా కప్ 2025లో, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లపై అందరి దృష్టి ఉంటుంది, ఎందుకంటే వారు ప్రతిష్టాత్మక ఖండాంతర టైటిల్ కోసం ప్రధాన పోటీదారులు. ఈసారి టోర్నమెంట్‌లో కొత్తగా ఆడుతున్న జట్లు యూఏఈ, ఒమన్, హాంకాంగ్. ఇవి 2024 ACC ప్రీమియర్ కప్‌లో టాప్ 3గా నిలిచి అర్హత సాధించాయి.

ఈ జట్లు ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ పూర్తి సభ్యులు. ఇప్పుడు ఆసియా కప్‌లో బలమైన జట్లకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో మైదానంలోకి దిగుతున్నాయి.

56
వరల్డ్ కప్ 2026 సన్నాహాలకు వేదికగా ఆసియా కప్

వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహాల వేదికగా ఆసియా కప్ 2025 మారనుంది. జట్లు తమ స్క్వాడ్లను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లు ప్రయత్నించడం, బ్యాటింగ్-బౌలింగ్ క్రమాలను మార్చడం చేస్తాయి.

ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్.. ఈ జట్లు తమ యువ ఆటగాళ్లను పరీక్షించి, వచ్చే ఏడాది వరల్డ్ కప్‌కు సిద్ధమవ్వాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నాయి.

66
ఆసియా కప్ లో వీరిపై లుక్కేయాల్సిందే

ఆసియా కప్ 2025లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, షాహీన్ అఫ్రిదీ, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు ప్రధానంగా దృష్టిని ఆకర్షించనున్నారు. అలాగే, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఇండియా తరఫున పెద్ద ఇంపాక్ట్ చూపే అవకాశముంది. పాకిస్తాన్ జట్టులో సైమ్ అయ్యూబ్, అబ్రార్ అహ్మద్, సాహిబ్‌జాదా ఫర్హాన్ కీలక పాత్ర పోషించవచ్చు.

అఫ్ఘానిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్, ఇబ్రాహీం జాద్రాన్, ఒమర్జాయి, శ్రీలంక ఆటగాళ్లు కమిందు మెండిస్, వెల్లలాగే, బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు రిషాద్ హొసైన్, తంజీమ్ సకీబ్ తమ జట్లకు విజయాలు అందించే సామర్థ్యంలో కలిగిన ప్లేయర్లుగా గుర్తింపు పొందారు. మొత్తంగా ఇవన్నీ కలిపి ఈ టోర్నమెంట్‌ మరింత ఆసక్తిని పెంచుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories