కావాలనే టీ20లకు దూరంగా మహ్మద్ షమీ... టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో హర్షల్ పటేల్?...

First Published Aug 5, 2022, 6:10 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహ్మద్ షమీ, ఆ టోర్నమెంట్ తర్వాత ఏడాదిగా ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. మహ్మద్ షమీ స్థానంలో హర్షల్ పటేల్‌ను ఆడించాలని భావిస్తున్న బీసీసీఐ, షమీని వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ, 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పటికే క్రీజులో కుదురుకుపోయిన మహ్మద్ రిజ్వాన్, వరుస బౌండరీలతో మ్యాచ్‌ని ముగించాడు...

Mohammed Shami

ఈ మ్యాచ్ తర్వాత మహ్మద్ షమీపై తీవ్రమైన ద్వేషం వెల్లగక్కారు నెటిజన్లు. షమీ మతాన్ని కారణంగా చూపిస్తూ, కావాలనే పాకిస్తాన్‌ని గెలిపించాడంటూ ట్రోల్స్ చేశారు... ఆ సమయంలో మహ్మద్ షమీకి మరో వర్గం నుంచి బీభత్సమైన సపోర్ట్ దక్కింది.. విరాట్ కోహ్లీ కూడా ఈ ట్రోల్స్ చేసేవారిని తిడుతూ కామెంట్లు చేశాడు...

టీమిండియా తరుపున 17 టీ20 మ్యాచులు ఆడి 18 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, గత ఏడాదిగా పొట్టి ఫార్మాట్‌కి దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో హర్షల్ పటేల్‌ లేదా అర్ష్‌దీప్ సింగ్‌ని ఆడించాలని భావిస్తోందట టీమిండియా...

‘మహ్మద్ షమీకి ఇప్పుడు 31 ఏళ్లు. అతని వయసు పెరుగుతోంది. ఈ సమయంలో మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండడం కాస్త కష్టమే. అందుకే టెస్టులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే టీ20ల్లో ఆడించడం లేదు...

Mohammed Shami

ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని షమీకి వివరంగా చెప్పాం. ప్లేయర్లకు వర్క్ లోడ్ లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌దే. అందుకే ప్లేయర్లను ఫిట్‌గా ఉంచేందుకు రెస్ట్ ఇస్తున్నాం...

టీ20ల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది... అందుకే షమీని టెస్టులు, వన్డేలకు పరిమితమయ్యాడు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో అతను ఆడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఓ బీసీసీఐ అధికారి...

మహ్మద్ షమీతో పాటు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని కూడా టీ20లకు దూరంగా పెట్టింది బీసీసీఐ. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా గబ్బర్‌కి గత ఏడాదిగా ఒక్క టీ20 మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...

Shikhar Dhawan

గత ఏడాది జూన్‌లో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఆ తర్వాత టీ20 మ్యాచులే ఆడలేదు. శిఖర్ ధావన్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా ఆడనున్నాడు... 

Harshal Patel

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులోకి ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్, ఇప్పటికే 17 టీ20 మ్యాచులు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు... కీలక సమయాల్లో పరుగులు ఇవ్వకుండా నియంత్రిస్తూ డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు.

click me!