త్రీడీ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రీఎంట్రీ... రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తూ, బౌలింగ్ చేసేందుకు...

First Published Aug 5, 2022, 4:04 PM IST

విరాట్ కోహ్లీ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈసారి విరాట్ ఓపెనర్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది...

విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ 2016 సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చి నాలుగు సెంచరీలు బాది, 973 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ విరాట్‌కి ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది...

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేశారు. కెఎల్ రాహుల్‌ని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉపయోగించారు. అప్పట్లో ఈ ప్రయోగం సక్సెస్ కూడా అయ్యింది...

Virat Kohli-Rohit Sharma

దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు మరోసారి ఇదే ఫార్ములాని వాడాలని భావిస్తోందట టీమ్ మేనేజ్‌మెంట్. వన్‌డౌన్‌లో ఫెయిల్ అవుతున్న విరాట్ కోహ్లీ, ఓపెనర్‌గా పంపితే సక్సెస్ కావచ్చని ఆలోచనలో ఉందట రోహిత్ సేన...

అలాగే విరాట్ కోహ్లీకి బౌలింగ్‌లోనూ మంచి రికార్డులు ఉన్నాయి. 2016 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై వికెట్ తీసిన విరాట్ కోహ్లీ, 2014 వరల్డ్ కప్‌లోనూ బౌలింగ్ చేసి మెప్పించాడు. పొట్టి ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ యావరేజ్ భువనేశ్వర్ కంటే మెరుగ్గా ఉంది...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేకపోవడంతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే విరాట్ కోహ్లీ బౌలింగ్ చేస్తాడని ప్రచారం జరిగింది...

Virat Kohli

ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను భారీ షాట్స్ ఆడకుండా నియంత్రించగలిగాడు. దీంతో అవసరమైతే విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయించేందుకు టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట...

Virat Kohli

ఫ్రీగా వదిలేసి, కావాల్సినంత రెస్ట్ ఇస్తున్నా విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రాకపోతుండడంతో అతన్ని ఖాళీగా ఉంచకుండా బిజీ బిజీగా ఉంచేందుకు అన్ని రకాలుగా వాడుకునేందుకు మార్గాలు వెతుకుతోందట. బిజీగా ఉంచితే పాత విషయాలు మరిచిపోతారనే ఫార్ములాని కోహ్లీపై వాడాలని రాహుల్ ద్రావిడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది...

Image credit: Getty

ఐపీఎల్ 2022 సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ని, రాజస్థాన్ రాయల్స్ వాడేసినట్టుగా విరాట్ కోహ్లీని ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో వాడుకోవాలని టీమిండియా భావిస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఇది నిజం కావాలని విరాట్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు... 

click me!