అందుకే వికెట్ తీసిన తర్వాత అలా సెలబ్రేట్ చేసుకుంటా... మహ్మద్ సిరాజ్ కామెంట్...

First Published Aug 15, 2021, 5:04 PM IST

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, టెస్టుల్లో అదరగొట్టే పర్పామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు...

ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి భారత జట్టుకి అవసరమైన బ్రేక్ అందించిన సిరాజ్... కీలక సమయంలో బెయిర్ స్టోను అవుట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు...

అయితే వికెట్ తీసిన తర్వాత నోటి మీద వేలు వేసుకుంటూ మహ్మద్ సిరాజ్ చేసుకునే సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి... 

తొలి టెస్టులో జానీ బెయిర్ స్టో వికెట్ తీసిన తర్వాత నోటి మీద వేలు వేసుకుంటూ సిరాజ్ చేసుకున్న సెలబ్రేషన్స్‌పై ఇంగ్లాండ్ క్రికెటర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు...

‘నాకు, సిరాజ్‌కీ మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. నేను అతన్నేం అనలేదు. అతను కూడా నన్ను ఏమీ అనలేదు. మరి నా వికెట్ పడిన తర్వాత అతను ఎందుకులా చేశాడో అర్థం కాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో...

అలాగే పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా కూడా సిరాజ్ సెలబ్రేషన్స్‌ చూడడానికి చాలా అతిగా అనిపిస్తున్నాయంటూ కామెంట్ చేశాడు...

‘జేమ్స్ అండర్సన్ వికెట్ తీసిన తర్వాత అలా సెలబ్రేట్ చేసుకోవడం లేదు. వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్ గౌరవంగా ఉండాలి. అవును... వికెట్ తీశావంటే నువ్వు, బ్యాట్స్‌మెన్‌పై విజయం సాధించినట్టే. అయితే 600+ వికెట్లు తీసిన అండర్సన్... మూతి మీద వేలు పెట్టడం కానీ, సెల్యూట్ చేయడం కానీ చేయడు...

ఓ ఛాంపియన్ బౌలర్ ఎలా ప్రవర్తించాలో జేమ్స్ అండర్సన్ చేసి, యువకులకు చూపిస్తున్నాడు. మన ఎంజాయ్‌మెంట్, మనకి జోష్ నిచ్చేలా ఉండేలా అంతేకానీ బ్యాట్స్‌మెన్‌ను తక్కువ చేసేలా కాదు...’ అంటూ కామెంట్ చేశాడు రమీజ్ రాజా...

తన సెలబ్రేషన్స్‌పై వస్తున్న విమర్శలపై స్పందించాడు మహ్మద్ సిరాజ్... ‘వికెట్ తీసిన తర్వాత నేను చేసుకునే సెలబ్రేషన్స్... బ్యాట్స్‌మెన్‌‌కి కాదు, నా విమర్శకులకు, హేటర్స్... నా  గురించి చాలా రకాలుగా రాస్తూ ఉంటారు... వాళ్లకి నా బాల్‌తోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నా...

అందుకే వికెట్ తీసిన తర్వాత నాపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే హేటర్స్‌ను నోరు మూసుకొమ్మంటూ అలా సెలబ్రేట్ చేసుకుంటా... ఇంగ్లాండ్‌లో ఫాస్ట్ బౌలర్లు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు...

రంజీ ట్రోఫీల్లో ఆడుతున్న సమయం నుంచే ఒకే లెంగ్త్‌లో, ఒకే స్పాట్‌లో బౌలింగ్ చేయడంపై తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నా... ఇదే నా సింపుల్ ప్లాన్...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ సిరాజ్...

ఆస్ట్రేలియా టూర్‌లో రెండో టెస్టులో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్, ఆ తర్వాత మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ చేశాడు. నాలుగో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించి, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు... 

click me!