లార్డ్స్ టెస్టులో భారత జట్టు 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 27 పరుగుల ఆధిక్యాన్ని సమం చేసిన భారత జట్టు... ఇకపై చేసే పరుగుల పైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది...
మూడో రోజు ఆఖరి బంతిని ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడంతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 12 ఓవర్లలో 27 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది...
27
30 బంతుల్లో 5 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు...
37
ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాది జోరు మీద ఉన్నట్టు కనిపించిన రోహిత్ శర్మ... మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కి ప్రయత్నించి, మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
47
27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా... ఈ మ్యాచ్‌ను నిలుపుకోవాలంటే కనీసం ఈ రోజు మొత్తం మూడు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది...
57
తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్, సెంచరీతో ఆదుకున్న కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరారు... వరుసగా విఫలం అవుతున్న ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే రాణిస్తేనే... 270+ పరుగులు చేయగలుగుతుంది...
67
తొలి టెస్టులో భారత జట్టును ఇబ్బంది పెట్టిన వాతావరణం, రెండో టెస్టులోనూ మరోసారి ఇండియాను చిక్కుల్లో పడేస్తోంది. మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన సమయంలో వాతావరణం వారికి బాగా సహకరించగా... నాలుగో రోజు ఉదయం వర్షం కురిసింది...
77
వర్షం, చిరుజల్లులతో పాటు వాతావరణం మేఘావృత్తం కావడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు చక్కగా సహకరిస్తుంది. దీంతో భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడే అవకాశం ఉందని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...