సచిన్, విరాట్, పాంటింగ్, ఏబీ డివిల్లియర్స్ చేయలేకపోయారు... మహ్మద్ షమీ చేసి చూపించాడు...

Published : Aug 16, 2021, 07:00 PM IST

ప్రపంచంలో ఎన్నో క్రికెట్ స్టేడియాలు ఉన్నా, లండన్‌లోని లార్డ్స్ గ్రౌండ్‌ను క్రికెట్ మక్కాగా పిలుస్తారు. అందుకే లార్డ్స్‌లో సెంచరీ చేసినా, ఐదు వికెట్లు తీసినా... దాన్ని చాలా పెద్ద ఘనతగా గుర్తించి, హానర్ బోర్డులో లిఖిస్తారు. అలాంటి లార్డ్స్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ షమీ...

PREV
19
సచిన్, విరాట్, పాంటింగ్, ఏబీ డివిల్లియర్స్ చేయలేకపోయారు... మహ్మద్ షమీ చేసి చూపించాడు...

క్రికెట్‌లో బ్యాటింగ్ దిగ్గజాలుగా పేరొందిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, ఏబీ డివిల్లియర్స్, జాక్వస్ కలీస్, జయవర్థనే వంటి ప్లేయర్లు కూడా లార్డ్స్ స్టేడియంలో హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయారు... 

29

లార్డ్స్‌లో పూజారా అత్యధిక స్కోరు 45 పరుగులు కాగా, విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 42 పరుగులు. సచిన్ టెండూల్కర్ అత్యధిక స్కోరు 37 పరుగులు కాగా... రవిచంద్రన్ అశ్విన్ ఇక్కడ 33 పరుగులు చేశాడు... 

39

లార్డ్స్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు మహ్మద్ షమీ... 2014లో భువనేశ్వర్ కుమార్ 52 పరుగులు చేయగా, షమీ 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు...

49

9వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి, లార్డ్స్‌లో సిక్సర్ బాదిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ షమీ... ఇంతకుముందు 1932లో అమర్‌సింగ్, 2002లో ఆశీష్ నెహ్రా లార్డ్స్‌లో సిక్సర్ బాదారు...

59

రెండో ఇన్నింగ్స్‌లో పూజారా, రోహిత్ శర్మ రెండో వికెట్‌కి 3.37 రన్‌రేటుతో పరుగులు సాధించగా... రహానే, రిషబ్ పంత్ 3.60 సగటుతో పరుగులు చేశారు. అయితే షమీ, ఇషాంత్ 3.75 రన్‌రేటుతో బుమ్రా, షమీ 4.20 రన్‌రేటుతో పరుగులు చేయడం విశేషం. 

69

ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్వదేశంలో మూడో ఇన్నింగ్స్‌లో 50+ పరుగులు సమర్పించి, వికెట్ తీయలేకపోవడం ఇదే తొలిసారి.. లార్డ్స్‌లో 10 టెస్టులు ఆడగా తొలిసారి వికెట్ తీయలేకపోయాడు.

79

2002 ట్రెంట్‌బ్జిడ్జ్ టెస్టులో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తర్వాత ఇంగ్లాండ్‌లో టీమిండియాకి 9వ వికెట్‌కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం రావడం ఇదే తొలిసారి...

89

లార్డ్స్ టెస్టులో 39 ఏళ్ల తర్వాత 9వ వికెట్‌కి భారత్ నుంచి 50+ భాగస్వామ్యం వచ్చింది. 1952లో రామ్, షిండే 9వ వికెట్‌కి 50+ భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత 1982లో కపిల్‌దేవ్, మదన్‌లాల్ కలిసి ఈ ఫీట్ సాధించారు...

99

మొయిన్ ఆలీ బౌలింగ్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు మహ్మద్ షమీ... 57 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన షమీ... 1932లో అమర్‌సింగ్, 2014లో భువనేశ్వర్ కుమార్ తర్వాత 9వ స్థానంలో లార్డ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు..

click me!

Recommended Stories