యుద్ధభూమి ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల రాజ్యం అధికారంలోకి వచ్చింది. ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్ల ఆకృత్యాలను నిలువరించలేక, వారికి అధికారం అప్పగించి... దేశం విడిచి వెళ్లిపోయాడు...
తాలిబన్లు అధికారంలోకి రావడంతో ప్రాణభయంతో దేశం విడిచిపోయేందుకు ఆఫ్ఘాన్ ప్రజలు క్యూలు కడుతున్నారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిసలాట జరిగి, వైమానిక సేవలు కూడా నిలిచిపోయాయి... ఆఫ్ఘాన్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి...
26
ఆఫ్ఘాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ ప్రపంచంలో కూడా కొన్ని అనుమానాలు రేగాయి. పసికూనగా ఎంట్రీ ఇచ్చిన ఆఫ్ఘాన్... అద్భుత ప్రదర్శనతో శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి టాప్ టీమ్‌లను వెనక్కినెట్టి టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12కి అర్హత సాధించింది...
36
ఆఫ్ఘాన్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన జట్టు పాల్గొంటుందా? ఆఫ్ఘాన్ ప్లేయర్లు, ఐపీఎల్‌లో ఆడతారా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి...
46
‘మీకు ఎలాంటి అక్కర్లేదు... టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘాన్ తప్పక ఆడుతుంది. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశాం... ప్రస్తుతం ఆఫ్ఘాన్‌లో ఉన్న ప్లేయర్లు కాబూల్‌లో ట్రైయినింగ్ సెషన్స్‌లో పాల్గొంటారు... ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో సిరీస్‌లు కూడా ఆడబోతున్నాం...
56
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘాన్‌లో మ్యాచులు పెట్టలేం కాబట్టి శ్రీలంక లేదా మలేషియాలో మ్యాచులు నిర్వహించేందుకు ప్లాన్స్ వేస్తున్నాం.. ’ అంటూ తెలిపాడు ఆఫ్ఘాన్ క్రికెట్ టీమ్ మీడియా మేనేజర్ హిక్మత్ హసన్...
66
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ‘ది హండ్రెడ్’ సిరీస్‌లో పాల్గొంటున్న ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ కూడా ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో పాల్గొనబోతున్నారు. నేరుగా వాళ్లు యూఏఈ చేరుకోబోతున్నారు...